యాక్టర్ హిమజ విల్లాపై పోలీసుల దాడి.. కేసు నమోదు

యాక్టర్ హిమజ విల్లాపై పోలీసుల దాడి.. కేసు నమోదు

బిగ్ బాస్ ఫేమ్, నటి హిమజ విల్లాపై దాడి చేశారు పోలీసులు. తన ఇంట్లో దీపావళి పార్టీ ఇస్తున్న క్రమంలో.. తన తోటి బిగ్ బాస్ నటులు, నటీమణులను పిలిచి రేవ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో మందుతోపాటు భారీ ఎత్తున సౌండ్ పెట్టి గంతులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే చుట్టుపక్కల వారు హిమజ ఇంట్లో జరుగుతున్న పార్టీపై పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. 

కంప్లయింట్ ఆధారంగా హిమజ ఇంట్లోకి వచ్చారు పోలీసులు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా.. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించటంతోపాటు.. న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారన్న ఉద్దేశంతో.. అక్కడ ఉన్న మందు, సౌండ్ సిస్టమ్స్ సీజ్ చేశారు పోలీసులు. హిమజతో పాటుగా మరో 11 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు .