IC 814: ది కాందహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైజాక్‌‌‌‌‌‌‌‌ టీజర్

IC 814: ది కాందహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైజాక్‌‌‌‌‌‌‌‌  టీజర్

విమానం హైజాక్ అనగానే..  వెంటనే గుర్తొచ్చేది 1999లో జరిగిన కాందహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైజాగ్‌‌‌‌‌‌‌‌ ఇన్సిడెంట్.  దీని స్ఫూర్తితో ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి.  ఇది జరిగి పాతికేళ్లు అవుతున్న సందర్భంగా ఇప్పుడో వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌‌ వస్తోంది. ‘ఐసి 814 : ది కాందహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైజాక్‌‌‌‌‌‌‌‌’ పేరుతో అనుభవ్ సిన్హా దీన్ని తెరకెక్కించారు. విజయ్ వర్మ, అరవింద్ స్వామి,  పంకజ్ కపూర్, నసీరుద్దీన్ షా ముఖ్యపాత్రలు పోషించారు. 

శనివారం టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. 1999 డిసెంబర్ 24న ఇండియన్ ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్స్ విమానం ఐసీ814ను హైజాక్ చేసిన టెర్రరిస్టులు.. లాహోర్, దుబాయిల మీదుగా అఫ్గానిస్థాన్‌‌‌‌‌‌‌‌లోని కాందహార్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. వాళ్ల డిమాండ్స్‌‌‌‌‌‌‌‌ను ఒప్పుకున్న భారత ప్రభుత్వం జైషే మహ్మద్‌‌‌‌‌‌‌‌ ఉగ్రవాద సంస్థ చీఫ్‌‌‌‌‌‌‌‌ మసూద్‌‌‌‌‌‌‌‌ అజహర్‌‌‌‌‌‌‌‌తో పాటు మరో 36 మందిని విడుదల చేసింది.  ఆ సమయంలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది పరిస్థితి ఏమిటి.. ప్రభుత్వం వారిని ఎలా కాపాడింది అనేది ఈ వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌‌లో చూపించారు. రియల్ ఇన్సిడెంట్స్‌‌‌‌‌‌‌‌కు దగ్గరగా తెరకెక్కించినట్టు టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చూస్తే అర్థమవుతోంది. ఆగస్టు 29 నుంచి నెట్‌‌‌‌‌‌‌‌ ఫ్లిక్స్‌‌‌‌‌‌‌‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది.