V6 News

Women's T20 World Cup 2026 schedule: ఒకే గ్రూప్‌లో ఇండియా, పాకిస్థాన్.. 2026 మహిళల టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల

Women's T20 World Cup 2026 schedule: ఒకే గ్రూప్‌లో ఇండియా, పాకిస్థాన్.. 2026 మహిళల టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల

క్రికెట్ ఫ్యాన్స్ కు ఐసీసీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. బుధవారం (జూన్ 18) 2026 మహిళల టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్ జూన్ 12 నుండి జూలై 5 వరకు జరుగుతుంది. లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఫైనల్ జరుగుతుంది. టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్ బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతుంది. మహిళా క్రికెట్ లో తొలిసారి తొలిసారిగా 12 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. దీంతో మహిళా ప్రపంచ కప్ చరిత్రలో ఇదే అతి పెద్ద ఎడిషన్ కాబోతుంది. 

ALSO READ | ICC వన్డే ర్యాంకింగ్స్‌ టాప్‌లో టీమిండియా స్టార్ ఓపెన‌ర్‌

మొత్తం 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూప్ లో ఆరు జట్లు ఉంటాయి. గ్రూప్ 1లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇండియా, పాకిస్థాన్ ఉన్నాయి. మరో రెండు జట్లు గ్లోబల్ క్వాలిఫైయర్ ఆడి అర్హత సాధిస్తాయి. గ్రూప్ 2లో ఇంగ్లాండ్, డిఫెండింగ్ ఛాంపియన్స్ న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్ ఉన్నాయి. మరో రెండు జట్లు గ్లోబల్ క్వాలిఫైయర్ ఆడి అర్హత సాధిస్తాయి. ప్రతి గ్రూప్ నుండి అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సెమీ ఫైనల్ కు చేరుకుంటాయి. జూన్ 30, జూలై 2 తేదీలలో వరుసగా రెండు సెమీ ఫైనల్స్ జరుగుతాయి. ది ఓవల్‌ సెమీ ఫైనల్ కు ఆతిధ్యమిస్తుంది. 

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జూన్ 14 న ఎడ్జ్ బాస్టన్ లో జరగనుంది. జూన్ 17 క్వాలిఫయర్ తో ,జూన్ 21 న సౌతాఫ్రికాతో, జూన్ 25 న క్వాలిఫయర్ తో, జూన్ 28 న ఆస్ట్రేలియాతో తలబడాల్సి ఉంది. ఎడ్జ్‌బాస్టన్, హాంప్‌షైర్ బౌల్, హెడింగ్లీ, ఓల్డ్ ట్రాఫోర్డ్, ది ఓవల్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్, లార్డ్స్‌లో మ్యాచ్ లు జరుగుతాయి. టోర్నీలో మొత్తం 33 మ్యాచ్ లు జరుగుతాయి. ఐపీఎల్ 2026 తర్వాత ఈ టోర్నమెంట్ జరగనుంది. ఐపీఎల్ కు ముందు భారత్ వేదికగా మెన్స్ టీ20 వరల్డ్ కప్ జరుగుతుంది.