దుబాయ్: అమ్మాయిల క్రికెట్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఐసీసీ భారీ ప్రైజ్ మనీని ప్రకటించింది. రానున్న విమెన్స్ టీ20 వరల్డ్ కప్ కోసం మొత్తం రూ. 82 కోట్ల ( 8.76 మిలియన్ డాలర్లు) భారీ మొత్తాన్ని కేటాయించింది. గత ఎడిషన్‌తో (రూ. 74 కోట్లు) పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ. ఇంగ్లండ్, వేల్స్ వేదికలుగా జూన్ 12 నుంచి జులై 5 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఈసారి జట్ల సంఖ్యను కూడా 12కు పెంచారు. ఈ టోర్నీ విన్నర్‌కు సుమారు రూ. 21.8 కోట్లు లభిస్తాయి. రన్నరప్ టీమ్‌కు రూ. 10 కోట్లు అందజేస్తారు.
సెమీ ఫైనల్లో ఓడిన జట్లకు రూ. 6.29 కోట్ల చొప్పున ప్రైజ్ మనీ దక్కుతుంది. గ్రూప్ దశలో పాల్గొనే ప్రతి జట్టుకు కనీసం రూ. 2.06 కోట్ల ఆదాయం గ్యారెంటీగా ఉంటుంది. ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సహా మొత్తం 12 జట్లు ఈ మెగా టోర్నీలో టైటిల్ కోసం పోటీ పడనున్నాయి.

