ICC టెస్ట్ ర్యాంకింగ్స్: మూడో స్థానానికి పడిపోయిన కోహ్లీ

ICC టెస్ట్ ర్యాంకింగ్స్: మూడో స్థానానికి పడిపోయిన కోహ్లీ

ICC టెస్టు ర్యాంకింగులను విడుదల చేసింది. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్స్ లో  ముగ్గురు ఇండియా ఆటగాళ్లు స్థానం సంపాదించారు. ఇందులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో స్థానం దిగజారాడు. మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ రెండో స్థానానికి ఎగబాకాడు. దీంతో.. కోహ్లీ స్థానం మూడో స్థానానికి పడిపోయింది. ఫస్ట్ ప్లేస్ ను న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ దక్కించుకున్నాడు.

విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మ డెలివరీ కోసం లీవ్ తీసుకున్నాడు. తొలి టెస్టు ఆడిన కోహ్లీ భార్య డెలివరీ సమయంలో పక్కనే ఉండాలనే కోరికతో ఇండియాకు తిరిగొచ్చాడు. ఆ తర్వాత జరిగిన రెండు టెస్టులకు దూరమయ్యాడు. దీంతో కోహ్లీ స్థానం తగ్గింది. ఈ ర్యాంకింగ్స్ లో అజింక్య రహానే ఏడో స్థానంలో, చటేశ్వర్ పుజారా ఎనిమిదో స్థానంలో ఉన్నారు.

ఆల్ రౌండర్ల జాబితాలో ఇండియా నుంచి ఇద్దరు టాప్ టెన్ లో నిలిచారు. రవీంద్ర జడేజా ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని రెండో ప్లేస్ లో నిలిచాడు. అశ్విన్ ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్ లో అశ్విన్ 9వ స్థానంలో, జస్ప్రీత్ బుమ్రా 10వ స్థానంలో ఉన్నారు.