కొంచెం తగ్గాలి.. ఇంత దూకుడు వద్దు : వైభవ్ సూర్యవంశీకి ICC స్ట్రాంగ్ వార్నింగ్

కొంచెం తగ్గాలి.. ఇంత దూకుడు వద్దు : వైభవ్ సూర్యవంశీకి ICC స్ట్రాంగ్ వార్నింగ్

Vaibhav Sooryavanshi: అసలు ఐర్లాండ్ టూర్‌కు వెళ్లే ముందు ప్రాక్టీస్ కోసం దంబుల్లా వన్డే ట్రై- సిరీస్ ఆడుతుంటే.. ఇక్కడ సీన్ కట్ చేస్తే లొల్లి కాస్తా ఫిజికల్ ఫైట్ దాకా పోయింది. జూన్15న (సోమవారం) శ్రీలంక A జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఇండియా A టీమ్ సూపర్ ఓవర్‌లో ఓడిపోవడమే కాకుండా, 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ.. లంక ప్లేయర్ విషెన్ హలంబగేతో గ్రౌండ్‌లోనే గట్టిగా కొట్లాడటం సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ గొడవపై మ్యాచ్ రెఫరీ ప్రదీప్ జయప్రగాష్ అఫీషియల్ యాక్షన్ తీసుకుంటాడా లేక వార్నింగ్‌తో వదిలేస్తాడా అనే సస్పెన్స్ నడుస్తోంది. ఈ క్రమంలో ఐసీసీ (ICC) రూల్ బుక్ ఏం చెబుతోంది? అసలు మ్యాచ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఐసీసీ (ICC) రూల్స్ ఏం చెబుతున్నాయి: 
క్రికెట్‌లో ప్లేయర్లు గొడవ పెట్టుకుంటే ఐసీసీ ఊరుకోదు.. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ లోని ఆర్టికల్ 2.12 (Article 2.12) ప్రకారం: ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఏ ఆటగాడైనా సరే.. అవతలి ప్లేయర్, అంపైర్, మ్యాచ్ రెఫరీ లేదా ప్రేక్షకుడితో తప్పుగా ప్రవర్తించినా, భౌతికంగా తాకినా (Inappropriate physical contact) అది నిబంధనల ఉల్లంఘన కిందకి వస్తుంది. 

శిక్షను ఎలా డిసైడ్ చేస్తారంటే:
* కావాలనే ఢీకొట్టారా (Intentional), లేదా అజాగ్రత్తగా జరిగిందా?
* ఎంత గట్టిగా నెట్టేశారు? అక్కడ ఏమైనా గాయాలు అయ్యాయా?
* ఎవరితో గొడవ పడ్డారు? అనే విషయాలను బట్టి మ్యాచ్ రెఫరీ శిక్షను ఖరారు చేస్తారు.. వైభవ్ లంక ప్లేయర్‌ను నెట్టేశాడు కాబట్టి ఇతనికి గట్టిగానే పెనాల్టీ పడే ఛాన్స్ ఉంది.

మ్యాచ్ ఎట్లా టై అయింది?: 
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా A జట్టు 143 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఆ టైమ్‌లో సూర్యాంశ్ షెడ్జ్ (72 రన్స్), విప్రాజ్ నిగమ్ (51 రన్స్) ఇద్దరూ కలిసి 8వ వికెట్‌కు ఏకంగా 104 పరుగుల పార్టనర్‌షిప్ జోడించి జట్టు స్కోరును 265 దాటించారు. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన శ్రీలంక A టీమ్ లో సదీర సమరవిక్రమ 93 రన్స్‌తో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి లంకను గెలుపు అంచుల్లోకి తీసుకెళ్లాడు. కానీ, లాస్ట్ ఓవర్ వేసిన అర్షద్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో లంక కూడా 265/9 స్కోరు దగ్గరే ఆగింది, దీంతో మ్యాచ్ టై అయింది.

సూపర్ ఓవర్ ట్విస్ట్: 
సూపర్ ఓవర్‌లో శ్రీలంక 16 రన్స్ కొట్టింది. 17 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ షెడ్జ్‌లను.. లంక డెబ్యూ పేసర్ కుగాథస్ మథులన్ అల్లాడించాడు. కేవలం 9 రన్స్ మాత్రమే ఇచ్చి లంకను గెలిపించాడు.

టేబుల్ పాయింట్స్: 
ఈ ఓటమితో తిలక్ వర్మ కెప్టెన్సీలోని ఇండియా A జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో ఓడిపోయి కష్టాల్లో పడింది. (ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వర్షంతో DLS పద్ధతిలో ఓటమి). ఇటు శ్రీలంక A మాత్రం 2 పాయింట్లతో దాదాపు ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది.