కుర్రాళ్ల వరల్డ్​ వార్

కుర్రాళ్ల వరల్డ్​ వార్

జార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టౌన్‌‌‌‌‌‌‌‌ (గయానా): క్రికెట్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌కు ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌ స్టార్స్‌‌‌‌‌‌‌‌ను పరిచయం చేసే మెగా ఈవెంట్‌‌‌‌‌‌‌‌కు వేళయింది. టీనేజర్లు తడాఖా చూపెట్టే టోర్నీ.. అండర్‌‌‌‌‌‌‌‌–19 వరల్డ్‌‌‌‌‌‌‌‌ శుక్రవారం స్టార్ట్‌‌‌‌‌‌‌‌ అవుతోంది. రికార్డు లెవెల్‌‌‌‌‌‌‌‌లో నాలుగు సార్లు చాంపియన్స్‌‌‌‌‌‌‌‌ అయిన యంగ్‌‌‌‌‌‌‌‌ ఇండియా ఐదో ట్రోఫీ టార్గెట్‌‌‌‌‌‌‌‌గా.. ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగుతోంది. కరీబియన్‌‌‌‌‌‌‌‌ గడ్డపై తొలిసారి జరుగుతున్న ఈ టోర్నీకి కరోనా ముప్పు ఉన్నప్పటికీ.. వరల్డ్‌‌‌‌‌‌‌‌ వైడ్‌‌‌‌‌‌‌‌ 16 టీమ్స్‌‌‌‌‌‌‌‌ నాలుగు గ్రూప్స్‌‌‌‌‌‌‌‌లో పోటీ పడుతున్నాయి.  సౌతాఫ్రికా, ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌, ఉగాండాతో పాటు ఇండియా గ్రూప్‌‌‌‌‌‌‌‌–బిలో ఆడుతోంది. ప్రతీ గ్రూప్‌‌‌‌‌‌‌‌లో నాలుగు టీమ్స్‌‌‌‌‌‌‌‌ మిగతా మూడింటితో ఒక్కో మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ఆడుతాయి. గ్రూప్‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌–2 టీమ్స్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌కు క్వాలిపై అవుతాయి. 

కొవిడ్‌‌‌‌‌‌‌‌ ముప్పు నేపథ్యంలో ఈ టోర్నీ కోసం పక్కా బయో బబుల్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేశారు. కానీ, జింబాబ్వే, పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ టీమ్స్‌‌‌‌‌‌‌‌ ఇప్పటికే కరోనాతో ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. తమ దేశంలో క్వారంటైన్‌‌‌‌‌‌‌‌ రిస్ట్రిక్షన్స్‌‌‌‌‌‌‌‌ ఉండటంతో న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌ ఈ టోర్నీ నుంచి తప్పుకోగా.. దాని ప్లేస్‌‌‌‌‌‌‌‌లో స్కాట్లాండ్‌‌‌‌‌‌‌‌ బరిలోకి దిగుతోంది. శుక్రవారం జరిగే ఫస్ట్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఆతిథ్య వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌.. ఆస్ట్రేలియాతో, స్కాట్లాండ్‌‌‌‌‌‌‌‌.. శ్రీలంకతో పోటీ పడుతాయి. ఇండియా శనివారం సౌతాఫ్రికాతో తమ ఫస్ట్‌‌‌‌‌‌‌‌  మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ఆడుతుంది. యష్‌‌‌‌‌‌‌‌ ధూల్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్సీలోని ఇండియా ఈ మధ్యే దుబాయ్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఆసియా అండర్‌‌‌‌‌‌‌‌–19 ట్రోఫీ నెగ్గి ఫుల్‌‌‌‌‌‌‌‌ జోష్‌‌‌‌‌‌‌‌లో ఉంది. దుబాయ్‌‌‌‌‌‌‌‌ నుంచి నేరుగా వచ్చిన టీమ్‌‌‌‌‌‌‌‌.. వామప్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌, ఆస్ట్రేలియాపై గెలిచింది. ఓపెనర్‌‌‌‌‌‌‌‌ హర్నూర్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌, ఆంధ్రకు చెందిన వైస్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ షేక్‌‌‌‌‌‌‌‌ రషీద్‌‌‌‌‌‌‌‌, పేసర్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌వర్దన్‌‌‌‌‌‌‌‌ ఫుల్‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో ఈ ముగ్గురూ దుమ్మురేపారు. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ యష్‌‌‌‌‌‌‌‌ ధూల్‌‌‌‌‌‌‌‌ కూడా మంచి టచ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాడు. లాస్ట్ టైమ్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో బంగ్లా చేతిలో అనూహ్యంగా ఓడి రన్నరప్‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టిన ఇండియా ఈసారి ఎలాగైనా గెలిచి ఐదో కప్పు అందుకోవాలని చూస్తోంది.