జాగ్రత్తగా ఉండాల్సిందే: టీ20 వరల్డ్ కప్‌కు స్టాప్ క్లాక్ రూల్

జాగ్రత్తగా ఉండాల్సిందే: టీ20 వరల్డ్ కప్‌కు స్టాప్ క్లాక్ రూల్

జూన్ నెలలో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌కు ఐసీసీ మరోసారి స్టాప్ క్లాక్ రూల్ ను తీసుకొని వచ్చింది. మొదట ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య డిసెంబర్ 2023లో ఐసీసీ ఈ ట్రయల్ ను ప్రవేశపెట్టింది. ఈ ట్రయల్ పీరియడ్ ఏప్రిల్‌లో ముగియాల్సి ఉంది. అయితే ఈలోగా ఐసీసీ ఈ నియమాన్ని వన్డే, టీ20ల్లో శాశ్వతం చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2024 టీ20 వరల్డ్ కప్ నుంచి ఈ రూల్ స్టార్ట్ అవుతుంది. దుబాయ్‌లో జరిగిన ఐసీసీ సమావేశంలో ఈ నిబంధన ఆమోదించబడింది.

మెన్స్‌‌‌‌‌‌‌‌ వన్డే, టీ20ల్లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొత్త రూల్​ తీసుకొచ్చింది. రెండు ఫార్మాట్లలో నిర్ణీత సమయంలో ఆటను పూర్తి చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మధ్య 60 సెకండ్ల కంటే ఎక్కువ గ్యాప్‌‌‌‌‌‌‌‌ ఉండకూడదన్న రూల్‌‌‌‌‌‌‌‌ తెచ్చింది. బౌలింగ్‌‌‌‌‌‌‌‌ టీమ్ ఒక ఓవర్ వేసిన తర్వాత నిమిషంలోపు తర్వాతి ఓవర్ స్టార్ట్​ చేయాల్సి ఉంటుంది. 

ఇందుకోసం స్టాప్‌‌‌‌‌‌‌‌ క్లాక్‌‌‌‌‌‌‌‌ను ఉపయోగిస్తారు. ఒకవేళ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో మూడుసార్లు 60 సెకండ్ల రూల్‌‌‌‌‌‌‌‌ను బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేస్తే బౌలింగ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌కు ఐదు రన్స్‌‌‌‌‌‌‌‌ పెనాల్టీ విధించి వాటిని బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌  స్కోరులో జతచేస్తారని ఐసీసీ గవర్నింగ్‌‌‌‌‌‌‌‌ బాడీ ప్రకటించింది. ఓవర్‌‌‌‌‌‌‌‌ల మధ్య తీసుకునే సమయాన్ని నియంత్రించడానికి ఈ నిబంధన ఉపయోగించబడుతుందని ఐసీసీ తెలిపింది. దీంతో ఫీల్డింగ్ చేసే జట్టుకు ఓవర్ల మధ్యలో  ఎక్కువ సేపు చర్చించే అవకాశం లేదు.