పాకిస్తాన్‌పై భారత్‌ ఘన విజయం

పాకిస్తాన్‌పై భారత్‌ ఘన విజయం

న్యూజిలాండ్‏లోని బే ఓవల్ స్టేడియం వేదికగా జరిగిన ఇండియా, పాకిస్తాన్ ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత జట్టు శుభారంభం ఇచ్చింది. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 107 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. కాగా పాక్‌పై భారత్‌కు ఇది వరుసగా 11వ విజయం.  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా.. 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 244 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‎కు దిగిన పాక్ జట్టు మొదటి నుంచి తడబడింది. లక్ష్య చేధనలో భారత బౌలర్ల దాటికి విలవిలలాడింది. ఒకరిద్దరు ప్లేయర్లు తప్ప ఎవరూ అంతగా రాణించలేకపోయారు. దాంతో పాక్ జట్టు 43 ఓవర్లలో 137 పరుగులకే అలౌట్ అయింది.  భారత జట్టు మొదటి మ్యాచ్ లోనే దాయాది పాక్ పై ఘన విజయం సాధించింది. భారత బౌలర్లలో రాజేశ్వరీ గైక్వాడ్‌ మూడు వికెట్లు పడగొట్టగా, గోస్వామి, స్నేహ్‌ రానా చెరో రెండు వికెట్లు సాధించారు.


అరంగేట్రం మ్యాచ్ లోనే పూజా వస్త్రాకర్‌(67) రాణించి ఆకట్టుకుంది.స్నేహ్‌ రానా(52) చెరో హాఫ్ సెంచరీలతో అదుకున్నారు. భారత బౌలర్‌ పూజా వాస్త్రాకర్‌ దుమ్ము రేపింది. వరల్డ్ కప్ అరంగేట్రంలోనే  విరోచిత ఇన్నింగ్స్‌తో ఆడింది.  59 బాల్స్ లో 67 రన్స్ చేసింది.