ఐస్‌బర్గ్ ఆర్గానిక్ ఔట్‌లెట్‌ ప్రారంభం

ఐస్‌బర్గ్ ఆర్గానిక్  ఔట్‌లెట్‌ ప్రారంభం

హైద‌రాబాద్, వెలుగు:  ఐస్‌బర్గ్ ఆర్గానిక్  ఐస్‌క్రీమ్స్‌  హైద‌రాబాద్‌లోని ఎ.ఎస్ రావు నగర్‌‌లో  కొత్త ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేసింది.  దీనిని  సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి ప్రారంభించారు.  హైదరాబాద్‌లో రాబోయే 2, 3 నెలల్లో మరిన్ని స్టోర్లు మొదలు పెడతామని  కంపెనీ ఫౌండర్ సుహాస్ చెప్పారు. 

విజయవాడలో కూడా బ్రాంచ్ స్టార్ట్ చేస్తామని,   సౌత్ ఇండియా మొత్తం విస్తరించే ప్రణాళికతో ఉన్నట్టు తెలిపారు. ఐస్‌బర్గ్ ఆర్గానిక్ ఐస్‌క్రీమ్స్ 2013 నుంచి ఆర్గానిక్ ఐస్ క్రీం ఇండ‌స్ట్రీలో అగ్రగామిగా  కొనసాగుతోందని,  2018లో పూర్తిగా ఆర్గానిక్ విధానంలోకి మారామని కంపెనీ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. ఏ2 దేశీ ఆవు పాలు, ఆర్గానిక్ యెల్లో బ‌ట‌ర్‌‌,   తీపి ప‌దార్థాలైన‌ ధాగా మిశ్రీ, కొక‌న‌ట్ షుగ‌ర్, బెల్లం వంటిని ఉపయోగిస్తున్నామని తెలిపింది