ఆగస్ట్ లో థర్డ్ వేవ్‌‌ రావొచ్చు .. ఐసీఎంఆర్ ఎక్స్ పర్ట్

ఆగస్ట్ లో  థర్డ్ వేవ్‌‌ రావొచ్చు .. ఐసీఎంఆర్ ఎక్స్ పర్ట్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆగస్టు చివరి నాటికి కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఐసీఎంఆర్ ఎపిడెమియాలజీ, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ విభాగం అధిపతి డాక్టర్ సమీరన్ పాండా వెల్లడించారు. అయితే అది సెకండ్ వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని చెప్పారు. ప్రధానంగా నాలుగు అంశాలు థర్డ్ వేవ్ కు కారణం కావచ్చని ఆయన తెలిపారు. ఫస్ట్, సెకండ్ వేవ్ టైంలో ప్రజలు పొందిన ఇమ్యూనిటీ తగ్గిపోవడం, ఇమ్యూనిటీ ఉన్నా వ్యాపించగల కొత్త వేరియంట్ రావడం లేదా వైరస్ వేగంగా వ్యాపించేలా మారిపోవడం, ఆయా రాష్ట్రాల్లో ముందుగానే ఆంక్షలు ఎత్తేయడం వల్ల థర్డ్ వేవ్ కు దారితీయొచ్చని వివరించారు. డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లు ఇప్పటికే దేశమంతా వ్యాపించాయని, వాటి నుంచి మరింత ముప్పు ఉండకపోవచ్చన్నారు. దేశంలో థర్డ్ వేవ్ రావడం తప్పదంటూ ఇటీవల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) చేసిన ప్రకటనపైనా ఆయన స్పందించారు. ఇప్పటికే ప్రభుత్వాలు, ప్రజలు రూల్స్ పట్టించుకోవడం లేదని, ప్రజలు పెద్ద ఎత్తున గూమిగూడే కార్యక్రమాలు షురూ చేసినందున థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉంటుందన్నారు.