Kalki 2898 AD: కల్కి స్థాయి వేరు.. హాలీవుడ్ సినిమాకి ఏమాత్రం తగ్గలేదు

Kalki 2898 AD: కల్కి స్థాయి వేరు.. హాలీవుడ్ సినిమాకి ఏమాత్రం తగ్గలేదు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కల్కి 2898 ఏడీ సినిమాపై, ఆ సినిమా యూనిట్ పై ప్రశంసలు కురిపించారు. కల్కి ప్రపంచస్థాయి సినిమాకు ఏ మాత్రం తగ్గని రేంజ్ లో ఉందని కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

కల్కి 2898 ఏడీ టీమ్‌కు నా అభినందనలు. ఇదొక అద్భుతమైన విజువల్ వండర్. నా మిత్రుడు ప్రభాస్‌ నటన సూపర్. అమితాబ్‌ బచ్చన్‌ గురించి, ఆయన నటన గురించి చెప్పడానికి మాటల్లేవ్. కమల్‌ హాసన్‌ ఒక అద్భుతం. దీపికా పదుకొణె, దిశా పటానీ అదరగొట్టేశారు. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ, ఆర్ట్, కాస్ట్యూమ్స్, ఎడిట్, మేకప్‌, టెక్నీకల్ డిపార్ట్మెంట్స్ గురించి. వారికి నా ప్రత్యేకమైన అభినందనలు.

ఇంత పెద్ద రిస్క్ తీసుకుని భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసినందుకు నిర్మాతలు అశ్వనీదత్‌, స్వప్నదత్‌కు నా ధన్యవాదాలు. ఇక దర్శకుడు నాగ్ అశ్విన్.. కల్కితో ప్రతి ప్రేమికుడిని ఆశ్చర్యానికి గురయ్యేలా చేశారు. మా అందుకు నాగీకి ప్రత్యేక అభినందనలు. చివరిగా ప్రపంచస్థాయి సినిమా ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోని మన సాంస్కృతిక, సున్నితమైన అంశాలతో కూడిన సినిమానే కల్కి 2898 ఏడీ.. అంటూ రాసుకొచ్చారు అల్లు అర్జున్.

ఇక కల్కి 2898 ఏడీ సినిమా విషయానికి వస్తే.. జూన్ 27న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. కేవలం రెండు రోజుల్లోనే రూ.300 కోట్ల వసూళ్లురాబట్టిన ఈ సినిమా ఆదివారంతో రూ.500 కోట్ల మార్కును దాటనుంది. ఈ కలెక్షన్స్ ఇలాగే కొనసాగితే మరో వారం రోజుల్లో రూ.1000 కోట్ల మార్కును దాటేస్తుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.