
క్రైమ్ మిస్టరీ షో సీఐడీలో ఇన్స్ పెక్టర్ గా నటించిన వివేక్ మష్రూ.. ఎంత పాపులరో చాలా మందికి తెలిసే ఉంటుంది. అతను నటుడిగా మాత్రమే మనకు తెలుసు. కానీ అతని అసలు వృత్తి ఏంటా అని ఎప్పుడైనా ఆలోచించారా..? వివేక్ రియల్ లైఫ్ లో బెంగళూరులోని CMR విశ్వవిద్యాలయం (CMRU)లో కామన్ కోర్ కరికులం (DCCC) విభాగం డైరెక్టర్గా పని చేస్తున్నాడట. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇటీవల వివేక్ ఫొటోను షేర్ చేస్తూ ఓ ట్విట్టర్ యూజర్.. మీకు ఇతని గురించి తెలిస్తే, మీ బాల్యం అద్భుతంగా ఉండేది" అని రాసుకొచ్చారు. దీనికి రిప్లైగా చాలా కామెంట్లు కూడా వచ్చాయి. అందులో ఓ యూజర్ స్పందిస్తూ, "అతను ఇప్పుడు నా సోదరుడి కాలేజీలో ప్రొఫెసర్, జోక్ కూడా కాదు" అని ట్వీట్ చేశారు. దీంతో వివేక్ వృత్తిపై అంతటా చర్చ మొదలైంది. ఆ తర్వాత అతను డిజైన్ థింకింగ్ - ఎ ప్రాక్టికల్ అప్రోచ్ బోధిస్తాడు అని మరో యూజర్ చెప్పారు. ఈ ట్వీట్ పై నటుడు వివేక్ మష్రూ కూడా స్పందించారు. తనపై చూపించే దయ, ప్రేమకు ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు. వివేక్ సీఐడీతో పాటు అక్కడ్ బక్కడ్ బాంబే బో షో, మార్నింగ్ రాగా, ఫైట్ క్లబ్: మెంబర్స్ ఓన్లీ వంటి సినిమాలలో కూడా పనిచేశారు.
1997లో తొలిసారిగా ప్రసారమైన TV షో CIDలో శివాజీ సతం (ACP ప్రద్యుమన్), సీనియర్ ఇన్స్పెక్టర్లు ఆదిత్య శ్రీవాస్తవ (అభిజీత్), దయానంద్ శెట్టి (దయా), ఫోరెన్సిక్ నిపుణులు డా. సలుంఖే, డా. తారికలు ప్రధాన పాత్రలలో హత్య రహస్యాలను ఛేదించడంపై రూపొందిన స్టోరీలలో నటించారు. ఈ కార్యక్రమం రెండు దశాబ్దాలకు పైగా విజయవంతంగా ప్రసారం చేయబడింది. అంతే కాదు ఇది 15వందల ఎపిసోడ్లను కూడా కలిగి ఉంది. CID 21 సంవత్సరాల తర్వాత అక్టోబర్ 27, 2019న ప్రసారమైంది. CID అనేది ఒక కల్పిత పరిశోధనాత్మక కార్యక్రమం.