స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులకు ఐడీ కార్డులు, క్వాలిటీ చెక్

స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులకు ఐడీ కార్డులు, క్వాలిటీ చెక్

ఈ మధ్య స్ట్రీట్ ఫుడ్ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హైదరాబాద్ నగర నలుమూల ఏ వీధి చూసిన ఏ రోడ్డు చూసిన ఖచ్చితంగా ఓ ఫుడ్ కోర్ట్ అయితే కనిపిస్తుంది. అంతలా ఈ స్ట్రీట్ ఫుడ్ కోర్టులు కస్టమర్స్ ని ఆకర్షిస్తున్నాయి. తక్కువ జీతాలు వచ్చే వారు ఇంటి భోజనం కోరుకునే వారు ఎక్కువగా ఈ స్ట్రీట్ ఫుడ్ లోనే ఆహారం తింటుంటారు. 

హాస్టల్స్ లో ఉండే విద్యార్థులు, మరియు ఉపాధి కోసం క్యాబ్, ఆటో రిక్షా నడిపేవారు అందరూ ఈ స్ట్రీట్ ఫుడ్ పై ఆధారపడి ఉంటారు. హైదరాబాద్ మహానగరంలో ఆహార ప్రియుల కోసం డీఎల్ఎఫ్ లాంటి స్ట్రీట్స్ ను ఏర్పాటు చేసిన అక్కడ అధిక రేట్లు ఉంటాయని సామాన్యులు ఈ స్ట్రీట్ ఫుడ్ కోర్టులను ఎంచుకుంటున్నారు. అక్కడ తక్కు ఖర్చుతో తమ భోజనాన్ని ముగించవచ్చని అభిప్రాయపడుతున్నారు. 

ఈ క్రమంలోనే స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులకు, హోటల్ నిర్వాహకులకు మధ్య క్వాలిటి ఫుడ్ అనేది తేడా ఉంటుంది. తక్కువ డబ్బుతో వస్తుందని సరైన పదార్థాలు వాడకుండా వండితే రోజు తినే వారి ఆరోగ్యం దెబ్బతింటుందని జీహెచ్ఎంసీ అధికారులు గుర్తింపు కార్డును ఇస్తే బాగుంటుందని భావిస్తున్నారు. వారిని ఫుడ్ సేప్టీ అధికారులతో తనిఖీలు చేసి ఆహారంలో నాణ్యత పాటించాలని సూచించాలని అభిప్రాయపడుతున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో స్ట్రీట్ ఫుడ్ కోసం వెళ్లే వారి సంఖ్య పెరుగుతుండటంతో రోడ్డు పై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 

ట్రాఫిక్ సమస్యతో వారు షాపు క్లోజ్ చేసుకునే దాక వెళ్లింది. నగర వ్యాప్తంగా మరిన్ని ఫుడ్ స్ట్రీట్ లు ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ ఇబ్బంది తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. స్ట్రీట్ ఫుడ్ కు ఇబ్బందిగా మారిన ట్రాఫిక్ సమస్యకు మంచి ఉదాహరణగా నిలిచారు సోషల్ మీడియా ఫేమ్ కుమారి ఆంటీ. హైటెక్ సిటీలోని తన స్టాల్ వద్ద మధ్యాహ్నా సమయంలో అధిక రద్దీ నెలకొనడంతో అధికారులు ఆమె షాపు క్లోజ్ చేయాలని ఆదేశించారు. తదుపరి ప్రభుత్వం ఆమె షాప్ రీ ఓపెన్ చేయవచ్చిన తెలిపిన ట్రాఫిక్ అనేది ఎప్పటికి వీడని చిక్కులా ఉంటుంది. వీరికంటూ మరిన్ని స్ట్రీట్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు