న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం ఐడీబీఐ బ్యాంక్‌లో మెజారిటీ వాటా (60.72 శాతం) విక్రయానికి సిద్ధమవుతోంది. ఇది దాదాపు రూ.63,900 కోట్ల విలువ చేస్తుంది. ఈ నెలలోనే బిడ్డింగ్ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది. ప్రభుత్వం 30.48 శాతం వాటాను, ఎల్ఐసీ 30.24 శాతం వాటాను వదులుకుంటాయి.
గతంలో భారీ మొండి బకాయిలతో నష్టపోయిన ఈ బ్యాంక్ ఇప్పుడు లాభాల్లోకి వచ్చింది. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎమిరేట్స్ ఎన్బీడీ, ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ వంటి సంస్థలు ఈ డీల్‌పై ఆసక్తి వ్యక్తం చేశాయి. కోటక్ ఈ విక్రయానికి ప్రధాన పోటీదారుగా ఉంది. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి వాటా అమ్మకం పూర్తవుతుందని భావిస్తున్నారు.
