
కేరళ విమాన ప్రమాదానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత విమానంలోని డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ (డిఎఫ్‌డిఆర్) మరియు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సివిఆర్) లను కనుగొన్నారు. ప్రమాద తీవ్రతను బట్టి అందరూ ఆ పరికరాలు కూడా పాడైపోయి ఉంటాయని అనుకున్నారు. కానీ అవి మాత్రం భద్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వాటి ద్వారా ప్రమాద సమయంలో విమానం యొక్క ఎత్తు, స్థానం మరియు వేగంతో పాటు పైలట్ల మధ్య సంభాషణలకు సంబంధించిన కీలకమైన సమాచారం తెలుస్తుంది. ప్రమాదానికి గల కారణం తెలియడానికి ఇప్పడు ఆ పరికరాలే కీలకంగా మారనున్నాయి.
అయితే విమానం నుంచి డిఎఫ్‌డిఆర్ మరియు సీవీఆర్ పరికరాలను తీసేందుకు విమానంలోని ఫ్లోర్‌బోర్డ్‌ను కట్ చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఆ రెండు పరికరాలను ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) అధికారులు ఢిల్లీ తీసుకువెళ్లనున్నారు.
For More News..