Idli Kottu: ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ రెడీ.. తెలుగు రైట్స్ ఎన్ని కోట్లు అంటే?

Idli Kottu: ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ రెడీ.. తెలుగు రైట్స్ ఎన్ని కోట్లు అంటే?

ఓ వైపు హీరోగా,  మరోవైపు దర్శకుడిగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు ధనుష్. గత ఏడాది ‘రాయన్, ఈ ఏడాది ప్రారంభంలో  ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమాలను డైరెక్ట్ చేసిన ధనుష్.. ప్రస్తుతం ‘ఇడ్లీ కడై’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

తను హీరోగా నటిస్తూ  డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని డాన్ పిక్చర్స్‌‌‌‌, వండర్‌‌‌‌బార్ ఫిల్మ్స్ బ్యానర్స్‌‌‌‌పై ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్నారు. నిత్యా మీనన్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, రాజ్‌‌‌‌కిరణ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే వీరి పాత్రలకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్స్‌‌‌‌ను రివీల్ చేసిన టీమ్ సినిమాపై ఆసక్తిని పెంచింది. అక్టోబర్ 1న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ టైటిల్‌‌‌‌తో శ్రీ వేదాక్షరి మూవీస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై చింతపల్లి రామారావు  విడుదల చేస్తున్నారు. దాదాపు రూ. 6 కోట్లకు డబ్బింగ్ రైట్స్ కొనుగోలు చేసినట్లు టాక్. 

ఈ సందర్భంగా చింతపల్లి రామారావు మాట్లాడుతూ ‘ధనుష్ గారి కెరీర్‌‌‌‌‌‌‌‌లోనే హయ్యెస్ట్ థియేటర్స్‌‌‌‌లో ఈ మూవీ రిలీజ్‌‌‌‌కు ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమా తెలుగు రైట్స్ మాకు ఇచ్చినందుకు ధనుష్ గారికి, టీమ్‌‌‌‌కు థ్యాంక్స్’ అని చెప్పారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

ఇకపోతే, తెలుగులో ధనుష్ నటించిన చిత్రానికి ఇదే అత్యధిక ధర అని సమాచారం. ధనుష్ నటించిన SIR మరియు కుబేర సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయాన్ని సాధించాయి. మరి ఇడ్లీ కొట్టు ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.