ఆర్మూర్ లో విగ్రహాల ప్రతిష్ఠాపన

ఆర్మూర్ లో విగ్రహాల ప్రతిష్ఠాపన

ఆర్మూర్​, వెలుగు: ఆర్మూర్ టౌన్​ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆవరణలోని నాగ లింగేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం విగ్రహాల ప్రతిష్ఠాపన జరిగింది.  గణపతి, సుబ్రహ్మణ్యం స్వామి,  జంట నాగులు,  లింగం, నంది విగ్రహాలను పురోహితులు శాస్రోక్తంగా ప్రతిష్ఠించారు. యజ్ఞం చేసిన అనంతరం అన్నదానం చేశారు.

 ఆలయ కమిటీ సభ్యులు  సత్య శ్రీనివాస్, అంబికా రమేశ్​, రాజయ్య, కలిగోట గంగాధర్, బీజేపీ జిల్లా నాయకులు జీవీ నర్సింహా రెడ్డి, బాలోజీ, రెడ్డి ప్రకాష్, బండి బాబు, నారాయణ, అజయ్, బండి రాజు, విజయానంద్ తదితరులు పాల్గొన్నారు.