తెలంగాణలో ఎకరం అమ్మితే.. ఆంధ్రాలో 100 ఎకరాలు వస్తది : మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణలో ఎకరం అమ్మితే..  ఆంధ్రాలో 100 ఎకరాలు వస్తది : మంత్రి శ్రీనివాస్ గౌడ్
  •  ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఎల్​బీనగర్,వెలుగు : తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రాలో100 ఎకరాలు వస్తుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఇక్కడ ఎకరం భూమి రూ.100 కోట్ల అమ్ముడుపోవడం వెనక రాష్ట్ర అభివృద్ధి కనిపిస్తుందని తెలిపారు. హయత్ నగర్ ఎక్సైజ్  పోలీస్ స్టేషన్ కొత్త భవనానికి స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి మంగళవారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఆనాటి ప్రభుత్వాలు ఆదాయం వచ్చే శాఖలను అభివృద్ధి చేసే ప్రయత్నం చేయలేదని చెప్పారు. 

డొక్కు బండ్లతో కాలం చెల్లిన వాహనాలను నడిపిస్తూ ఎక్సైజ్ శాఖను పట్టించుకోలేదన్నారు. అన్ని కులవృత్తులను కాపాడుకుంటూ అన్నిరంగాలను అభివృద్ధి చేసేందుకు అనుక్షణం సీఎం సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని చెప్పారు. ఎక్సైజ్ కమిషనర్ ముషారఫ్ అలీ ఫారూఖ్, రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య, అధికారులు రవీందర్, లక్ష్మణ్ గౌడ్, సరళ పాల్గొన్నారు.