దాడులు చేస్తే ఊరుకోబోము: మంత్రి కేటీఆర్

దాడులు చేస్తే ఊరుకోబోము: మంత్రి కేటీఆర్

ప్రజల ప్రాణాలను కాపాడడానికి.. తమ ప్రాణాలు పణంగా పెట్టి సేవ చేస్తున్న వైద్య సిబ్బందిపై కొంతమంది దాడికి దిగుతున్నారు. మరికొంతమంది వారి విధులకు అడ్డుపడుతున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని…దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమంటూ హెచ్చరిస్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్ . హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్య సిబ్బందిపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. నిజామాబాద్‌లో చికిత్స అందించేందుకు వచ్చిన డాక్టర్లను అడ్డుకోవడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు ఘటనలను సహించేది లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం వీటిని తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. ఇలాంటి పనులు చేసే వ్యక్తులు అజ్ఞానులే కాదు…వారి కారణంగా ఇతరులకు కూడా ప్రమాదమేనంటూ ట్విట్టర్ ద్వారా తెలిపారు మంత్రి కేటీఆర్.