బండి సంజయ్‌కి దమ్ముంటే రేపు భాగ్యలక్ష్మి ఆలయానికి రావాలె : పైలెట్ రోహిత్ రెడ్డి

బండి సంజయ్‌కి దమ్ముంటే రేపు భాగ్యలక్ష్మి ఆలయానికి రావాలె : పైలెట్ రోహిత్ రెడ్డి

తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హైదరాబాద్ లోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణ కోసం అనుక్షణం పోరాటం చేసి సాధించిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు. బీఆర్ఎస్ ప్రకటనతో బీజేపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని వ్యాఖ్యానించారు. ‘బీజేపీ నాయకులంటే భాగ్యలక్ష్మి ఆలయం అంటారు కదా... అందుకే ఇక్కడకు వచ్చాను’ అని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కు దమ్ముంటే రేపు భాగ్యలక్ష్మి ఆలయానికి రావాలని సవాల్ విసిరారు. భాగ్యలక్ష్మి అమ్మవారి సమక్షంలో కర్ణాటక కేసుపై ప్రమాణం చేద్దామని ఛాలెంజ్ చేశారు.

తనకు ఈడీ నోటీసులు పంపడంపై స్పందించిన రోహిత్ రెడ్డి.. తాము ఈడీ, సీబీఐలకు భయపడమని స్పష్టం చేశారు. ఈడీ నోటీసులు చూసి లాయర్లే ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. ఈడీ నోటీసుల్లో తన వ్యతిగత బయోడేటా మాత్రమే అడిగారని తెలిపారు. తన బయోడేటా పబ్లిక్ డొమైన్ లో దొరుకుంది...దానికి నోటీసులు ఇవ్వాలా..? అని ప్రశ్నించారు. బండి సంజయ్ కు దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలని అన్నారు. రేపు ఉదయం 10 గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి సంజయ్ రావాలని కోరారు. న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని స్పష్టం చేశారు.