పిల్లల్లో హైపరాక్టివ్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ను తగ్గించాలంటే ఫుడ్‌‌‌‌‌‌‌‌ను మార్చాలి

పిల్లల్లో హైపరాక్టివ్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ను తగ్గించాలంటే ఫుడ్‌‌‌‌‌‌‌‌ను మార్చాలి

పిల్లలు అల్లరి చేస్తే బాగానే ఉంటుంది. కానీ అదే అల్లరి అతిగా మారితే  కొన్ని ఇబ్బందులుంటాయి. పిల్లలు హైపరాక్టివ్‌‌‌‌‌‌‌‌గా మారితే వాళ్ల ఎమోషన్స్ కూడా అతిగా మారే అవకాశం ఉంది. అందుకే హైపరాక్టివ్ పిల్లల అల్లరిని చిన్నప్పటి నుంచే తగ్గించాలి.

  • పిల్లలు హైపరాక్టివ్‌‌‌‌‌‌‌‌గా ఉండడం వల్ల పెద్దగా మాట్లాడతారు, వద్దన్న పనే చేస్తుంటారు. వీళ్లకు  కోపం కూడా ఎక్కువ. చిన్న వయసులో వాళ్లని సరిచేయకపోతే పెద్దయ్యే కొద్దీ మరింత మొండిగా మారే అవకాశం ఉంటుంది.
  • పిల్లల్లో హైపరాక్టివ్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ను తగ్గించాలంటే వాళ్లు తినే ఫుడ్‌‌‌‌‌‌‌‌ను మార్చాలి. షుగర్ కంటెంట్‌‌‌‌‌‌‌‌ తగ్గించి.. కాయగూరలు, పండ్లు, పాలు లాంటివి ఎక్కువ ఇవ్వాలి.
  • హైపరాక్టివ్‌‌‌‌‌‌‌‌గా ఉండే పిల్లల స్ర్కీన్‌‌‌‌‌‌‌‌టైం తగ్గించాలి. హైపరాక్టివ్‌‌‌‌‌‌‌‌గా ఉండే పిల్లలు వీడియో గేమ్స్‌‌‌‌‌‌‌‌కు ఎక్కువగా ఎడిక్ట్ అవుతారు. గేమ్ ఓడిపోయినప్పుడల్లా వాళ్లకు కోపం, చిరాకు లాంటివి పెరుగుతుంటాయి. 
  • హైపరాక్టివ్  పిల్లలను మరింత గారాబం చేయడం వల్ల వాళ్ల అల్లరి మరింత పెరుగుతుంది. అందుకే వీళ్లతో కొంత స్ట్రిక్ట్‌‌‌‌‌‌‌‌గా ఉండాలి. స్కూల్ కెళ్లడం, తినడం లాంటి విషయాల్లో కచ్చితంగా వ్యవహరించాలి.
  • పేరెంట్స్ తరచుగా కోప్పడడం, గట్టిగా అరవడం వంటివి చేస్తుంటే  ‘అలా చేయడం కరెక్టే’ అనుకుంటారు పిల్లలు. వాళ్లూ అదే రిపీట్ చేస్తారు. పిల్లలకు మ్యూజిక్, ఆర్ట్ నేర్పించడం ద్వారా వాళ్లలోని హైపరాక్టివ్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ను తగ్గించొచ్చు.