పిల్లలు తప్పులు చేస్తే.. ఎలా సరిదిద్దుకోవాలో చెప్పండి

పిల్లలు తప్పులు చేస్తే.. ఎలా సరిదిద్దుకోవాలో చెప్పండి

పిల్లలు పెద్దయ్యాక ఎమోషనల్​గా స్ట్రాంగ్​గా​ ఉండాలి, సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలి  అంటే పేరెంట్స్​ ఇలా ఉండాలి... 

  • పిల్లలు మెచ్యూర్డ్​గా లేరని, చిన్న చిన్న విషయాలకు భయపడుతున్నారని, తప్పులు చేస్తున్నారని.. కోప్పడుతుంటారు తల్లిదండ్రులు. దానివల్ల తమకు తామే తప్పు చేస్తున్నట్లు ఫీలౌతారు. నిర్ణయాలు తీసుకోలేరు. అందుకే పిల్లలు తప్పులు చేస్తే.. వాటినెలా సరిదిద్దుకోవాలో చెప్పాలే తప్ప.. వాళ్లని తక్కువ చేసి మాట్లాడకూడదు.
  • పిల్లలు తీసుకునే నిర్ణయాల్లో.. పెద్దలు తలదూర్చకూడదు.  కాకపోతే  గైడెన్స్​ ఇవ్వాలి. దీనివల్ల డెసిషన్​ మేకింగ్​ పవర్​ పెరుగుతుంది. అలా కాదని, వాళ్ల నిర్ణయాలు కూడా తల్లిదండ్రులే తీసుకుంటే పెద్దయ్యాక సమస్య అవుతుంది. 
  • పిల్లల్ని భయపెట్టడం, కొట్టడం లాంటివి చేస్తే వాళ్లు ఎమోషనల్​గా  వీక్​ అవుతారు. వాళ్ల ఎమోషన్స్​ని బలవంతంగా కంట్రోల్​ చేయాలని చూసినా ఇబ్బందే. అందుకే వాళ్లని వాళ్లలా ఉండనివ్వాలి.  పరిస్థితి చెయ్యి దాటినట్టు అనిపిస్తే  నచ్చజెప్పాలే తప్ప చెయ్యి చేసుకోకూడదు.
  • ‘నేను నీకు అది కొనిపెట్టలేను.. ఆర్థికంగా మన పరిస్థితి’ ఇది అనే మాటలు పిల్లలకు పదేపదే చెప్తే..  వాళ్లలో విక్టిమ్​ మెంటాలిటీ పెరుగుతుంది. అంటే వాళ్లని వాళ్లు నిస్సహాయులుగా అనుకుంటారు.  ప్రయత్నించకుండానే చేయాల్సిన పనిని వదిలేస్తారు. అందుకే పిల్లలకి ఫైనాన్షియల్​ స్టేటస్​ గురించి చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్పాలి.