చేస్తే అన్ని థియేటర్లు బంద్ చేయాలి..

చేస్తే అన్ని థియేటర్లు బంద్ చేయాలి..
  • నిర్మాత నట్టి కుమార్

హైదరాబాద్: సినిమా థియేటర్ల బంద్ విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో రూల్ మాదిరి మినహాయింపులివ్వడం సరికాదని సినీ నిర్మాత నట్టికుమార్ పేర్కొన్నారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రిలీజ్ అయిన పెద్ద సినిమాలకు మినహాయింపులివ్వాలని సవరణలు సూచించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జిఓ చిన్న నిర్మాతలకు, వకీల్ సాబ్ కి వ్యతిరేకంగా వచ్చిందనటం అవాస్తవం  అని నిర్మాత నట్టి కుమార్ స్పష్టం చేశారు. ఏపీ  ప్రభుత్వం జిఓ ను ఏప్రిల్ 8న ఇచ్చింది, వకీల్ సాబ్ సినిమా 9న విడుదల అయిందన్నారు. ఆ సినిమా టికెట్లలో తేడా వల్ల బెనిఫిట్ షో లు రద్దు చేశారు అంతేగాని ప్రభుత్వం షో లు రద్దు చేసిందనటం అవాస్తవం అన్నారు. అందరికీ అనుకూలంగా జిఓ సవరణలు ఉన్నాయ్ అన్నారు. బి, సి థియేటర్లలో టికెట్ల గురించి గవర్నమెంట్ ఆలోచించాలని డిమాండ్ చేశారు. సురేష్ బాబు మీటింగ్ పెట్టి థియేటర్లు బందు అంటున్నారు.. అయితే  వకీల్ సాబ్ నడిచేవరకు ఉంటాయట... మాకో రూల్ మీకో రూలా... బంద్ చేస్తే అన్ని థియేటర్స్ బంద్ చెయ్యాలి అంతేకాని మినహాయింపులుండొద్దని ఆయన సూచించారు. రేపు నా సినిమా కూడా రిలీజ్ వుంది.. అందుకే నాకు బాధగా వుందన్నారు. రేపటి నుండి బంద్ అయ్యే థియేటర్లు పై యాక్షన్ తీసుకొని లైసెన్స్ క్యాన్సిల్ చెయ్యాలని నిర్మాత నట్టి కుమార్ డిమాండ్ చేశారు.