కరోనా పేషెంట్లను ఇండ్లకు పంపిస్తున్నారు

కరోనా పేషెంట్లను ఇండ్లకు పంపిస్తున్నారు

హైదరాబాద్, వెలుగు : కరోనా సోకి గాంధీ లో ట్రీట్ మెంట్ పొందుతున్న పేషెంట్లను ఇండ్లకు పంపిస్తున్నారు. పాజిటివ్ అయినా వైరస్ లక్షణాలు లేని వారికి ఇళ్లలోనే ట్రీట్ మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి వారందరినీ గుర్తించి వీరిని హోం క్వారంటైన్ లోనే ఉంచుతూ ట్రీట్ మెంట్ చేయటం షురూ చేశారు. కరోనా పాజిటివ్ ఉండి వైరస్ లక్షణాలు లేని 50 మందిని శనివారం ఇళ్లకు పంపించినట్లు గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. రాజారావు తెలిపారు. ఇళ్లలో ప్రత్యేకంగా గది, ఇతర వసతులు ఉన్న వారిని గుర్తించి ఇండ్లకే పంపిస్తున్నామన్నారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పెద్దగా ఇబ్బంది లేని పేషెంట్లకు ఇంటి దగ్గరే ట్రీట్ మెంట్ చేసేలా ప్లాన్ చేశారు. రెండో విడతలో ఇండ్లలో వసతి లేని వారిని అమీర్ పేట్ లోని ప్రకృతి చికిత్సాలయం లో క్వారంటైన్​ కు తరలిస్తామన్నారు. ఇలా హోం క్వారంటైన్​కు తరలించిన వారి ఆరోగ్య పరిస్థితులను అబ్జర్వేషన్ లో పెడతామన్నారు. వారికి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే కరోనా ప్రత్యేక నెంబర్ కు ఫోన్ చేస్తే అవసరమైన సలహాలు ఇస్తామని డాక్టర్ రాజారావు చెప్పారు. మరీ ఎక్కువ సమస్య ఉంటే హాస్పిటల్ తరలిస్తామన్నారు.

ఆఫ్ లైన్లో..ఆన్ లైన్లో స్మార్ట్ ఫోన్లు దొరకడం లేదు