
జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అధిష్ఠానం తనకు పోటీ చేసే అవకాశం కల్పిస్తే.. తప్పక విజయం సాధిస్తానని ఆ పార్టీ నాయకురాలు మాధవీలత ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తే గెలిచి నియోజకవర్గంలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని చెప్పారు. డెవలప్మెంట్లో కేంద్ర సాయం తీసుకుంటానన్నారు. బోరబండ ప్రభుత్వ గురుకుల స్కూల్లో లోపా ముద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ. 19 లక్షలతో ఏర్పాటు చేస్తున్న తాగునీటి శుద్ధి కేంద్రానికి బుధవారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.