రష్యా,ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగల్గితే నేను స్వర్గానికి వెళ్లొచ్చు: అమెరికా ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ డొనాల్డ్ ట్రంప్‌‌‌‌‌‌‌

 రష్యా,ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగల్గితే నేను స్వర్గానికి వెళ్లొచ్చు: అమెరికా ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ డొనాల్డ్ ట్రంప్‌‌‌‌‌‌‌

వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపగలిగితే తాను స్వర్గానికి చేరుకునే అవకాశం పెరుగుతుందని అమెరికా ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ డొనాల్డ్‌‌‌‌‌‌‌‌ ట్రంప్‌‌‌‌‌‌‌‌ అన్నారు. మంగళవారం ఫాక్స్‌‌‌‌‌‌‌‌ న్యూస్‌‌‌‌‌‌‌‌ చానల్‌‌‌‌‌‌‌‌తో మాట్లాడుతూ ఆయన ఈ కామెంట్‌‌‌‌‌‌‌‌ చేశారు. ప్రస్తుతం తన పనితీరు బాగాలేదని విన్నానని అన్నారు. తనకు స్వర్గానికి వెళ్లే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నట్లు తెలిసిందన్నారు. 

‘‘నేను స్వర్గానికి వెళ్లే అవకాశాలు ప్రస్తుతం చాలా తక్కువగా ఉన్నాయని విన్నాను. కానీ, ఈ యుద్ధాన్ని ఆపగలిగితే.. అది స్వర్గ ప్రవేశానికి దోహదపడుతుంది. శాంతిని సాధించడం ద్వారా స్వర్గానికి వెళ్లే అవకాశాలు మెరుగుపడతాయి” అని ట్రంప్‌‌‌‌‌‌‌‌ అన్నారు. కాగా, రష్యా–ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌ దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు ట్రంప్‌‌‌‌‌‌‌‌ తన ప్రయత్నాలు మరింత పెంచారు. వారం రోజుల్లోనే ఆ రెండు దేశాల లీడర్లతో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే ట్రంప్‌‌‌‌‌‌‌‌ శాంతి, స్వర్గం గురించి ఈ  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.