ఆదిలాబాద్ జిల్లాలో అక్రమంగా సంపాదిస్తే ఆస్తుల్ని జప్తు చేయండి

ఆదిలాబాద్ జిల్లాలో  అక్రమంగా సంపాదిస్తే ఆస్తుల్ని జప్తు చేయండి
  • బాండ్ పేపర్​లో రాసినవన్నీ చేస్తా.. లేదంటే రాజీనామా చేస్తా

ఇంద్రవెల్లి(నార్నూర్)వెలుగు: తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం పల్లెల్లో జోరందుకుంది. అనుచరులు, కుటుంబసభ్యులతో కలిసి జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని బాబేఝారి గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి సిడం సుధాకర్ వినూత్నంగా ప్రచారం చేస్తున్నాడు. 

తనను సర్పంచ్ గా గెలిపిస్తే అక్రమంగా సంపాదించుకోనని, ఇప్పుడు ఉన్న ఆస్తులకు మించి ఎక్కువ సంపాదిస్తే వాటిని గ్రామ పంచాయతీ జప్తు చేయాలని బాండ్ పేపర్ రాసి ఇచ్చాడు. 

ఓటర్ల వద్దకు వెళ్లి తనను గెలిపిస్తే గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు దుర్వినియోగం కాకుండా చూస్తానని మాట ఇస్తున్నాడు. పనుల కోసం ప్రజల వద్ద చేయి చాచనని చెబుతున్నాడు. తాను గెలిచాక మూడు సంవత్సరాలు గ్రామంలో అభివృద్ధి చేయకపోతే సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తానని పేర్కొంటున్నాడు.