జాబ్ నోటిఫికేషన్లు ఇస్తుంటే ప్రతిపక్షాలకు నిద్రవడ్తలే

జాబ్ నోటిఫికేషన్లు ఇస్తుంటే ప్రతిపక్షాలకు నిద్రవడ్తలే
  •      పీసీసీ అధికార ప్రతినిధులు భవానీ రెడ్డి, లింగమ్ యాదవ్ 

హైదరాబాద్, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేయని పనులను కొత్త ప్రభుత్వం చేస్తోందని..అందుకే  ప్రతిపక్షాలకు నిద్ర కూడా  పట్టడం లేదని పీసీసీ అధికార ప్రతినిధులు భవాని రెడ్డి, లింగమ్ యాదవ్  అన్నారు. నిరుద్యోగులకు మంచి జరుగుతుండటాన్ని కూడా ఓర్చుకోలేకపోతున్నారని, దగా డీఎస్సీ అని విమర్శలు చేయటం కరెక్ట్ కాదన్నారు. గురువారం గాంధీ భవన్ లో భవానిరెడ్డి , లింగమ్ యాదవ్  మీడియాతో మాట్లాడారు.  నిరుద్యోగులకు ప్రయోజనం కలిగించేట్లు మెగా డీఎస్సీ ఇస్తే....ప్రతిపక్షాలు అవాకులు, చవాకులు పేలడంలో అర్థం లేదన్నారు.  

నర్సులు, పోలీసు కానిస్టేబుల్‌‌, డిఎస్సీ ఇలా ఒక్కొక్కటే నోటిఫికేషన్లు  విడుదల చేస్తూ ఉద్యోగాలు భర్తీకి  కొత్త ప్రభుత్వం చొరవ చూపుతోందన్నారు.  ప్రభుత్వం కూలుతుందని విమర్శలు చేయకుండా సలహాలు ఇవ్వాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ను భవాని రెడ్డి కోరారు. టెట్ నిర్వహించాలని నిరుద్యోగులు కోరుతున్నారని, సీఎం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.