ఫామ్లోకి రాకపోతే కోహ్లీపై వేటు పడే ఛాన్స్

ఫామ్లోకి రాకపోతే కోహ్లీపై వేటు పడే ఛాన్స్
  • రాణిస్తున్న కుర్రాళ్ల నుంచి జట్టులో పోటీ
  • నేడు ఇంగ్లండ్ తో ఇండియా రెండో టీ20
  • తొలి మ్యాచ్ లో రోహిత్ సేన గ్రాండ్ విక్టరీ
  • శనివారం రా. 7 నుంచి సోనీ నెట్ వర్క్ లో 

బర్మింగ్ హామ్: ఒకవైపు జట్టులోకి వచ్చిన ప్రతీ కుర్రాడు బ్యాటింగ్ తో దుమ్మురేపుతూ ఒక్కో ప్లేస్ కు ఇద్దరు. ముగ్గురు పోటీ పడుతుండగా.. మరోవైపు పేలవ ఫామ్ తో నిరాశ పరుస్తున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన కెరీర్లోనే అత్యంత గడ్డుకాలం ఎదు ర్కొంటున్నాడు. ఈ పరిస్థితుల్లో తిరిగి ఫామ్ లోకి రావాలని ఆశిస్తున్న కోహ్లీ ఇంగ్లాండ్ తో శనివారం జరిగే రెండో మ్యాచ్లో ఐదు నెలల తర్వాత టీ 20 తిరిగి ఎంట్రీ ఇస్తున్నారు. తొలి మ్యాచ్ లో ఘన విజయం సాధించిన టీమిండియా ..ఈ మ్యాచ్ లో నెగ్గి సిరీస్ ను ఖాతాలో వేసుకోవాలని చూస్తుండగా.. అందరి దృష్టి కోహ్లి పైనే ఉంది. టీ 20 వరల్డ్ కప్ అనంతరం కెప్టెన్సీ పదులుకున్న విరాట్ తన చివరి ఇంటర్నేషనల్ టీ20 ఫిబ్రవరిలో ఆడాడు. ఐపీఎల్లో ఆడినా అక్కడా నిరాశ పరిచాడు. టీమ్ రెస్ట్ రొటేషన్ పాలసీ ప్రకారం కోహ్లీతోపాటు ఇతర సీనియర్లు తరచుగా విరామం తీసుకోగా వాళ్ళ స్థానాల్లో వచ్చిన ఇషాన్ కిషన్, దీపక్ హుడా అవకాశాలను అందుకున్నారు. ఐర్లాండ్ పై సత్తా చాటిన దీపక్ హుడాను తుది జట్టులో కొనసాగిస్తే రోహిత్ తో కలిసి కోహ్లి ఓపెనర్ గా వచ్చే చాన్సుంది అప్పుడు ఇషాన్ కేషన్ ను  తప్పించాల్సి ఉంది. ఈ సిరీస్ తర్వాత వెస్టిండీస్ తో  ఐదు టీ20ల సిరీస్ కు కూడా రెస్ట్ తీసుకోవాలని భావిస్తున్న కోహ్లి తక్షణమే ఫామ్లోకి రావాల్సిన అవసరం ఉంది. లేదంటే టీ20 జట్టులో అతని ప్లేస్ కు గ్యారంటీ ఇవ్వలేం.

బరిలోకి బుమ్రా, పంత్, జడ్డూ,అయ్యర్
కోహ్లి, పంత్, బుమ్రా, జడేజా, శ్రేయస్ అయ్యర్ తిరిగి రావడంతో జట్టు బలం మరింత పెరిగింది. రోహిత్ కూడా ఫామ్ లో ఉండటం కలిసొచ్చే అంశం. ముఖ్యంగా వరల్డ్ కప్ లో  సంప్రదాయ  ఆట కారణంగా జట్టు బోల్తా కొట్టిన నేపథ్యంలో బ్యాటర్లు తమ ఆటను మార్చి పవర్ ప్లేలో దూకుడు పెంచారు. ఇదిమం ది విషయమే అయినా ఫినిషింగ్ స్కిల్స్ ను  ఇంకా మెరుగు పరుచుకోవాలి. అక్షర్ పటేల్ ప్లేస్ లో జడేజా తిరిగొస్తే లోయర్ ఆర్డర్ మరికాస్త బలంగా మారుతుంది. కొత్త బాల్ తో  సత్తా చాటుకున్న భువీతో బుమ్రా పేస్ బాధ్యతలు పంచుకుంటాడు. ఇమ్రాన్ మాలిక్ కు చాన్స్ రావొచ్చు. హార్దిక్ తన అల్రౌండ్ పెర్పామెన్స్ తో  సత్తా చాటుతున్నాడు. తొలి మ్యాచ్లో క్యాచ్ లు జార విడిచిన నేపథ్యంలో తమ ఫీల్డింగ్ మెరుగవ్వాలని కెప్టెన్ రోహిత్ కోరుకుంటున్నాడు. మరోవైపు తొలి మ్యాచ్ లోనే తేలిపోయిన ఇంగ్లాండ్ ఈ పోరులో పుంజుకోవాలని చూస్తోంది. జట్టు ఎక్కువగా ఆధారపడ్డ కెప్టెన్ బట్లర్ గత పోరులో డకౌటయ్యాడు. అతనిప్పుడు ఎలా ఆడతాడో చూడాలి. బ్యాటింగ్ లో  లివింగ్ స్టోన్, జేసన్ రాయ్ రాణిస్తేనే ఇంగ్లండ్ సిరీస్ లో నిలుస్తుంది. అదే సమయంలో వాళ్ల బౌలర్లు కూడా పుంజుకోవాల్సి ఉంటుంది.