సమస్యల పరిష్కారానికి రాజీనామాయే మార్గం

సమస్యల పరిష్కారానికి రాజీనామాయే మార్గం

మునుగోడు ప్రజల సమస్యల పరిష్కారానికి రాజీనామాయే సరైన మార్గమని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మునుగోడు ప్రజలు సంతోషంగా లేరని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. మూడున్నరేళ్లలో మునుగోడు నియోజకవర్గంలో ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని చెప్పారు.  ప్రజలకు న్యాయం చేయలేని ఎమ్మెల్యే పదవి ఎందుకున్నారు.  రాజీనామా అంశం తెరపైకి రాగానే గట్టుప్పల్ మండలం ఏర్పాటు చేశారని చెప్పారు.ఈ విధంగానే నియోజకవర్గం మొత్తం అభివృద్ధి అవుతుందనుకుంటే.. పోడు సమస్య తీరుతుందనుకుంటే... ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి  ప్రకటించారు.

యాదాద్రి- భువనగిరి జిల్లా   సస్థాన్ నారాయణపురం మండలంలో ఆయన పర్యటించారు.  ఐదు దొనల తండా, కడిలా బాయి తండా, తుంబాయ్ తండాలో  ప్రజలతో సమావేశమయ్యారు.  రాచకొండ రైతుల పోడు భూముల సమస్యపై బాధితులతో చర్చించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

పర్యటనలో భాగంగా రాజగోపాల్ రెడ్డి పోడు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సమయంలో పోడు రైతుల సమస్యలు పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎన్నికల హామీని గాలికొదిలేసి రైతుల నుంచి భూములు లాక్కుంటున్నారని మండిపడ్డారు. పోడు రైతుల సమస్యల పరిష్కారానికి అవసరమైతే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని MLA రాజగోపాల్ రెడ్డి తెలిపారు.