విధులకు రాకపోతే మిగతా బస్సులు ప్రైవేట్ పరం: కేసీఆర్

విధులకు రాకపోతే మిగతా బస్సులు ప్రైవేట్ పరం: కేసీఆర్

నవంబర్5వ తేదీ అర్ధరాత్రి లోపు సమ్మెని విరమించి ఉద్యోగాలలో చేరకపోతే మిగతా బస్సు రూట్లను కూడా ప్రైవేట్ పరం చేసేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆర్టీసిపై క్యాబినెట్ భేటీ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 10,600 రూట్లలో ఇప్పటికే 5,100 రూట్లను ప్రైవేట్ పరం చేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. గడువులోపు విధులకు ఎవరూ రాకపోతే మిగతా రూట్లను కూడా ప్రైవేట్ పరం చేస్తామని తేల్చిచెప్పారు. ఇది తన నిర్ణయం కాదని క్యాబినెట్ నిర్ణయమని.. ఇందులో ఏ మార్పు ఉందన్నారు. కార్మికుల కుటుంబాలను ఈ రాష్ట్ర అధినేతగా.. ఒక సోదరుడిలా చెబుతున్నానన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని కార్మికులు వినియోగించుకుని.. తప్పకుండా విధులకు రావాలన్నారు. యూనియన్ల మాయలో పడి కార్మికులు కుటుంబాలను రోడ్ల మీద తెచ్చుకోవద్దని సూచించారు సీఎం కేసీఆర్.