పీవోకేను భారత్ లో కలిపితే బీజేపీలో చేరతా

పీవోకేను భారత్ లో కలిపితే బీజేపీలో చేరతా

టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బీజేపీలో చేరతానన్నారు. అయితే పాక్ ఆక్రమిత కశ్మీర్ ను మోడీ స్వాధీనం చేసుకుంటేనే బీజేపీలో చేరతానన్నారు. ఆర్టికల్ 370 ని రద్దును సమర్థిస్తానన్నారు. కొన్నివిషయాల్లో మోడీకి జై కొట్టాల్సిందేనన్నారు.  అనంతపురంలో జేసీ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ను కలిశారు. అనంతరం మాట్లాడిన ఆయన ప్రాంతీయ పార్టీలకు ఆదరణ తగ్గుతుందన్నారు. జాతీయ పార్టీలతోనే దేశాభివృద్ధి  సాధ్యమన్నారు.అయితే ప్రాంతీయ పార్టీలు ఉన్నంత వరకు తాను టీడీపీలోనే ఉంటానన్నారు. కానీ పీవోకేను భారత్ లో కలిపితే బీజేపీలో చేరతానన్నారు. రాష్ట్రరాజధాని అమరావతే ఉండాలన్నారు. లేకపోతే రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలని డిమాండ్ చేశారు జేసీ.