బిగ్ ట్విస్ట్ : పూనం పాండే చనిపోతే.. డెడ్ బాడీ ఏదీ.. ఎక్కడుందీ..

 బిగ్ ట్విస్ట్ : పూనం పాండే చనిపోతే.. డెడ్ బాడీ ఏదీ.. ఎక్కడుందీ..

వివాదాస్పద నటి పూనం పాండే చనిపోయింది.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ రాశారు.. 24 గంటలు కూడా కాలేదు.. బిగ్ ట్విస్ట్.. అసలు పూనం పాండే చనిపోయిందా లేదా అనే క్వశ్చన్ తో సోషల్ మీడియా హోరెత్తుతుంది. పూనం పాండే చనిపోలేదని.. బతికే ఉందంటూ కొందరు చెప్పటమే కాకుండా.. కొన్ని ప్రశ్నలు సంధిస్తుండటంతో.. ఇప్పుడు ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయ్యింది.

పూనం పాండే చనిపోతే డెడ్ బాడీ ఎక్కడ ఉంది.. ఎందుకు చూపించటం లేదు.. ఏ ఆస్పత్రిలో చనిపోయింది.. చనిపోయిన తర్వాత ఎక్కడికి తీసుకొచ్చారు.. అంత్యక్రియలు చేయాలి కదా.. ఎందుకు ఆ వార్తలు బయటకు రావటం లేదు.. అసలు పూనం పాండే చనిపోలేదని.. అంతా పబ్లిసిటీ స్టంట్ అని కొందరు ఈ ప్రశ్నలతో ముందుకు రావటంతో.. ఇప్పుడు పూనం పాండే మరణ వార్త కలకలం రేపుతుంది.

పూనం పాండే డెడ్ బాడీ ఎక్కడ ఉంది.. ఏ ఆస్పత్రిలో ఉంది.. అంత్యక్రియలు ఎక్కడ చేస్తున్నారంటూ ముంబైలోని ఆమె ఇంటికి వెళ్లిన వారికి షాక్.. అసలు అక్కడ ఎవరూ లేరు.. పూనం పాండే కుటుంబ సభ్యులు అందుబాటులో లేరు.. బంధువులు, చుట్టాలు స్పందించటం లేదు.. అసలు మాకేం తెలీదు అంటూ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకోవటం చూస్తుంటే.. అసలు పూనం పాండే చనిపోలేదు అని కొందరు అంటున్నారు.

బతికే ఉందని.. అజ్ణాతంలో ఉందని మరికొందరు చెబుతున్నారు. అలాంటప్పుడు ఆమె సొంత సోషల్ మీడియా అకౌంట్ల నుంచి.. ఆమె టీం మెంబర్స్ ఎలా పోస్టు చేశారు అనేది ఇప్పుడ ప్రశ్న. అసలు పూనం పాండే బతికి ఉన్నదా.. చనిపోయిందా.. చనిపోతే డెడ్ బాడీ ఏదీ.. ఎక్కడ అంత్యక్రియలు చేశారు అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

 

ఏది ఏమైనా పూనంపాండే తన నటన కంటే తన కాంట్రవర్సీలతోనే బాగా హైలెట్ అయ్యారనేది అందరికీ తెలిసిందే.. ఇప్పుడు చావు దగ్గర కూడా ఇలాంటి డ్రామా నడుస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫ్యామిలీ మొత్తం అదృశ్యం వెనక కారణాలు సైతం ఆసక్తి రేపుతున్నాయి.