IPL 2024: ఆర్‌సీబీ టైటిల్ గెలిస్తే అదొక చరిత్ర: ఇర్ఫాన్ పఠాన్

IPL 2024: ఆర్‌సీబీ టైటిల్ గెలిస్తే అదొక చరిత్ర: ఇర్ఫాన్ పఠాన్

'ఆర్‌సీబీ - ఐపీఎల్ టైటిల్..' ఇదొక కథ. ఐపీఎల్ ఫ్రాంచైజీల్లోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కు టైటిల్ అనేది అందని ద్రాక్ష. ప్రతి సీజన్ ప్రారంభం ముందు ఈసాలా కప్ నామ్‌దే అంటూ(ఈసారి కప్ తమదే..) అంటూ ఆ జట్టు అభిమానులు హంగామా చేయడం తప్ప వారు సాధించింది ఏం లేదు. ఆటగాళ్లను మారుస్తున్నా. కెప్టెన్లను మారుస్తున్నా.. ఆ జట్టు రాత మాత్రం మారడం లేదు. 2009, 2011, 2016లో ఫైనల్ చేరినా.. తృటిలో టైటిల్ చేజార్చుకుంది. పోనీ ఈ ఏడాదైనా ఆ కరువు తీరేనా..! అంటే అదీ అనుమానమే. గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో ఆ జట్టు కొనుగోలు చేసిన ఆటగాళ్లు అలా ఉన్నారు. 

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలిచే అవకాశాలపై, ఆ జట్టు అభిమానులపై మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించారు. ఆర్‌సీబీ ఫ్రాంచైజీ ప్రపంచంలో అత్యంత నమ్మకమైన అభిమానులను కలిగి ఉన్నారనన్న పఠాన్.. వారు టైల్ గెలిస్తే టీ20 లీగ్ చరిత్రలోనే అదొక చారిత్రక ఘట్టమని చెప్పుకొచ్చారు.

"ఆర్‌సీబీ ఫ్రాంచైజీ- ఆ జట్టు అభిమానుల బంధాన్ని చూడండి.. ప్రపంచంలో అత్యంత నమ్మకమైన అభిమానులు వారికున్నారు. ఆ జట్టు ఒక్కసారి టైటిల్ గెలవకపోవచ్చు. కానీ, వారు మూడుసార్లు దగ్గరగా వచ్చారు.. ఒకవేళ 2024లో వారు టైటిల్ గెలిస్తే, అది ఆర్‌సీబీ చరిత్రలోనే కాదు, ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద క్షణం అవుతుంది.." అని పఠాన్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు.

Also Read : నా కుటుంబసభ్యులు ఎంతో బాధ పడ్డారు.. మరోసారి తప్పు చేయను

కాగా, 2022 ఐపీఎల్‌కు ముందు కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. ఫాఫ్ డు ప్లెసిస్ తదుపరి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గతేడాది ఆర్‌సీబీ ఆరో స్థానంలో నిలిచి ప్లేఆఫ్‌కు అర్హత సాధించలేకపోయింది.

ఐపీఎల్ 2024కు ఆర్‌సీబీ జట్టు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కరణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ డాగర్, విజయ్‌కుమార్ వైషాక్, ఆకాశ్ దీప్, మహహ్మద్ సిరాజ్, రాస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కర్రాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్. 

స్క్వాడ్ బలం: 25
విదేశీ ఆటగాళ్లు: 8