హెల్త్ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటే ఇవి ఉండాలె..

హెల్త్  ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటే ఇవి ఉండాలె..
  • ఫ్యామిలీ మెంబర్ల కోసం తీసుకునే ముందు  అన్ని అంశాలు పరిశీలించాలన్న ఎనలిస్టులు
  • కవరేజ్‌‌‌‌‌‌‌‌, వాల్యూ యాడెడ్‌‌‌‌‌‌‌‌ బెనిఫిట్స్‌‌‌‌‌‌‌‌, అదనపు ఇన్సెంటివ్స్‌‌‌‌‌‌‌‌ వంటివి ఇచ్చే పాలసీనే కొనాలి
  • ప్రీమియం భరించే స్థాయిలో ఉండాలి

న్యూఢిల్లీ: కరోనా వలన  హెల్త్ ఇన్సూరెన్స్  ఎంత ముఖ్యమో తెలిసింది. హాస్పిటల్ బిల్లులు, మెడికల్ ఖర్చులు మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు భరించలేని స్టేజ్‌‌‌‌‌‌‌‌లో  ఉన్నాయి. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్లను కూడా కవర్ చేసేలా ఫ్యామిలీ హెల్త్‌‌‌‌‌‌‌‌ పాలసీలు తీసుకోవాలన్నారు. కానీ, పాలసీ తీసుకునే టైమ్‌‌‌‌‌‌‌‌లో అనేక సందేహాలు ఉంటాయి. పాలసీ ఎంచుకునే టైమ్‌‌‌‌‌‌‌‌లో ఫాలో కావాల్సిన అంశాలను ఎనలిస్టులు వివరించారు.

1) కవరేజ్‌‌‌‌‌‌‌‌, ప్రయోజనాలు..

హెల్త్‌‌‌‌‌‌‌‌ ఇన్సూరెన్స్ పాలసీలను ఎంచుకునేటప్పుడు కవరేజ్‌‌‌‌‌‌‌‌ ఎంత? ఏయే బెనిఫిట్స్‌‌‌‌‌‌‌‌ ఉంటాయి? అనే అంశాలను ముందుగా పరిగణించాలి.  వివిధ హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్ ఖర్చులను  పాలసీ భరించేటట్టు ఉండాలి. అంటే హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో జాయిన్ అయితే బెడ్ ఖర్చులు, సర్జరీ, డయాగ్నోస్టిక్స్‌‌‌‌‌‌‌‌ ఖర్చులు, ఆంబులెన్స్‌‌‌‌‌‌‌‌ రైడ్స్‌‌‌‌‌‌‌‌, హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో జాయిన్‌‌‌‌‌‌‌‌ అవ్వక ముందు, డిశ్చార్జ్‌‌‌‌‌‌‌‌ అయ్యాక అయ్యే ఖర్చులను  ఇన్సూరెన్స్ పాలసీ కవర్ చేసేటట్టు ఉండాలి. క్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి క్రిటికల్ ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్లను కూడా పాలసీ కవర్ చేస్తుందా?  అని చూడాలి. అంతేకాకుండా అదనంగా కొన్ని ఇన్సెంటివ్స్ కూడా అందించే పాలసీలు ఎంచుకోవాలి. అంటే ప్రెగ్నెన్సీ బెనిఫిట్స్‌‌‌‌‌‌‌‌, అదనపు ఆంబులెన్స్ రైడ్స్ వంటివి.  ఒకవేళ మీ ఇంట్లో   వృద్ధులెవరైనా ఉంటే వారి ఏజ్‌‌‌‌‌‌‌‌లో ఎదురయ్యే హెల్త్‌‌‌‌‌‌‌‌ సమస్యలను కవర్ చేసే పాలసీల వైపు మొగ్గు చూపాలి.

2) వాల్యూ యాడెడ్‌‌‌‌‌‌‌‌ బెనిఫిట్స్‌‌‌‌‌‌‌‌

వాల్యూ యాడెడ్ బెనిఫిట్స్‌‌‌‌‌‌‌‌ అందించే పాలసీలను కొనాలని ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు. ప్లాన్ ఖర్చు పెరగకుండా కవరేజ్‌‌‌‌‌‌‌‌ను పెంచుకోవడానికి వీలు కలిపించే పాలసీలు ఎంచుకోవాలన్నారు. ఫ్రీ హెల్త్‌‌‌‌‌‌‌‌ చెకప్స్‌‌‌‌‌‌‌‌, ఆర్గాన్‌‌‌‌‌‌‌‌ డొనేషన్స్‌‌‌‌‌‌‌‌, ఆటోమేటిక్ రెన్యువల్‌‌‌‌‌‌‌‌ వంటి వాల్యూ యాడెడ్‌‌‌‌‌‌‌‌ బెనిఫిట్స్‌‌‌‌‌‌‌‌ అందించే పాలసీలు బెటర్ అని చెప్పారు. ఇన్సూరెన్స్ ప్లాన్‌‌‌‌‌‌‌‌ అఫోర్డబుల్ ధరలో ఉండేందుకు కొన్ని కంపెనీలు ప్రీమియంపై డిస్కౌంట్స్ ఇస్తాయి.  ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ పాలసీ కొనడం, అదనపు మెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పాలసీ కిందకు తీసుకురావడం వంటి సర్వీస్‌‌‌‌‌‌‌‌లపై ధర తగ్గించే పాలసీలు చూసుకోవాలి.

3) పాలసీ కిందకు కొత్తవారు..

ఇన్సూరెన్స్ పాలసీ కవరేజ్ కిందకు అదనపు మెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకురావడం ఈజీ కాదు. ఈ విషయంలో ఫ్లెక్సిబుల్‌‌‌‌‌‌‌‌గా ఉండే పాలసీలు తీసుకోవాలని ఎనలిస్టులు సలహా ఇస్తున్నారు. దీంతో ఇతర ఫ్యామిలీ మెంబర్లు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అదే ప్లాన్‌‌‌‌‌‌‌‌ను కొనసాగించడానికి వీలుంటుందన్నారు.  

4) ప్రీమియం కట్టగలిగేలా..

పాలసీ ప్రీమియంలను కట్టడంలో ఇబ్బందులు ఉండకూడదు. అవసరానికి తగ్గట్టు ఏ ఫీచర్లు కావాలో ముందే షార్ట్ లిస్ట్ చేసుకోవాలి.  కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ ఫీచర్లను ఇచ్చే పాలసీలపై భారీ ప్రీమియం వసూలు చేస్తాయి. అందువలన ప్రీమియం కట్టడంలో ఇబ్బంది పడకుండా ఉండే పాలసీలనే ఎంచుకోవాలి.

5) క్లయిమ్‌‌‌‌‌‌‌‌ సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఈజీగా..

హెల్త్‌‌‌‌‌‌‌‌ ఇన్సూరెన్స్ పాలసీలను ఎంచుకునే ముందు ఈజీగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్లయిమ్ చేసుకోవడానికి వీలు కలిపించే పాలసీలనే  ఎంచుకోవాలి. అంతేకాకుండా  ఎక్కువ క్లయిమ్‌‌‌‌‌‌‌‌ సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ రేషియో ఉన్న  కంపెనీల వైపే మొగ్గు చూపాలి.  క్లయిమ్‌‌‌‌‌‌‌‌ సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్ రేషియో ద్వారా కంపెనీ తనకొచ్చిన  క్లయిమ్స్‌‌‌‌‌‌‌‌లో ఎన్ని సెటిల్ చేసిందనే విషయం అర్థమవుతుంది.

6) కో – పేమెంట్‌‌‌‌‌‌‌‌..

కో– పేమెంట్ క్లాజ్‌‌‌‌‌‌‌‌ కూడా ముఖ్యమని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఈ క్లాజ్ కింద పాలసీ హోల్డర్లు తమ హాస్పిటల్ ఖర్చులో ఎంత మేర భరిస్తారనేది తెలుస్తుంది. మిగిలినది ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. కొన్ని పాలసీలు కో– పేమెంట్ క్లాజ్‌‌‌‌‌‌‌‌ను ఆప్షన్‌‌‌‌‌‌‌‌గా ఇస్తాయి. కావాలంటే ఈ క్లాజ్‌‌‌‌‌‌‌‌ ఎంచుకోవచ్చు.