బంధన్ నుంచి హెల్త్‌‌ కేర్ ఫండ్

బంధన్ నుంచి హెల్త్‌‌ కేర్ ఫండ్

న్యూఢిల్లీ: హెల్త్‌ ‌‌‌కేర్ సెక్టార్‌పై ఫోకస్ పెట్టే కొత్త ఫండ్‌ను బంధన్ ఏఎంసీ ఈ నెల 10న   ప్రారంభించింది. నవంబర్ 24 వరకు న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓ) ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటుంది. ఫార్మా, హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డయాగ్నోస్టిక్స్ కంపెనీలలో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఇది బీఎస్ఈ హెల్త్‌‌‌‌ కేర్ టీఆర్‌ఐ (టోటల్ రిటర్న్ ఇండెక్స్‌)ని బెంచ్‌మార్క్‌‌గా ఫాలో అవుతుంది.

ఫండ్ మేనేజర్ విరాజ్ కులకర్ణి దీనిని  నిర్వహిస్తారు. భారత్‌లో వృద్ధులు పెరుగుతుండడం, ఆదాయాల్లో వృద్ధి, జీవనశైలి మార్పుల వల్ల పెరుగుతున్న హెల్త్‌ కేర్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ ఫండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేశారు. ‘‘ఇండియాలో హెల్త్‌ కేర్ ఖర్చు జీడీపీలో 5.4శాతం మాత్రమే, యూఎస్‌లో ఇది 16.5శాతంగా ఉంది. వచ్చే 20 ఏళ్లలో  ఇండియా జనాభా సగటు  వయస్సు 28 నుంచి 38కి పెరగనుంది. దీంతో  దీర్ఘకాలిక వ్యాధులు, ప్రివెంటివ్ కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఖర్చు పెరుగుతుంది” అని బంధన్ ఏఎంసీ పేర్కొంది.