ఇవేకో, టాటా మోటార్స్ డీల్‌కు ఇటలీ ప్రభుత్వం ఆమోదం

ఇవేకో, టాటా మోటార్స్ డీల్‌కు ఇటలీ ప్రభుత్వం ఆమోదం

న్యూఢిల్లీ: కమర్షియల్ వెహికల్స్ తయారు చేసే కంపెనీ ఇవేకోను టాటా మోటార్స్‌‌‌‌‌‌‌‌కు విక్రయించేందుకు ఇటలీ ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ డీల్‌‌‌‌‌‌‌‌ను అక్టోబర్ 31న అధికారికంగా ప్రకటించారు. ఇవేకోను సుమారు రూ.38,900 కోట్లకు (3.8 బిలియన్ యూరోలకు) టాటా మోటార్స్‌ కొనుగోలు చేయనుంది.

ఈ కంపెనీకి చెందిన డిఫెన్స్ విభాగాన్ని లియోనార్డో  అనే ఇటలీ ప్రభుత్వ- కంపెనీకి సెపరేట్‌గా విక్రయిస్తున్నారు. టాటా మోటార్స్‌‌‌‌‌‌‌‌, ఇవేకో  డీల్ వచ్చే ఏడాదిలో పూర్తవుతుంది. ఈ ఇటలీ కంపెనీకి చెందిన నాన్-డిఫెన్స్ వ్యాపారాన్ని, టాటా మోటార్స్ తన కమర్షియల్ వెహికల్ బిజినెస్‌‌‌‌‌‌‌‌లో విలీనం చేయనుంది.