రూల్స్ పాటించకపోతే కూల్చుడే: GHMC

రూల్స్ పాటించకపోతే కూల్చుడే: GHMC

చట్టాలు, నిబంధనల మేరకు భవన నిర్మాణాలు చేపట్టాలని GHMC కమిషనర్‌ దానకిశోర్‌ నగరవాసులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే నిర్ధా క్షిణ్యంగా కూలగొడతామని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో శనివారం ‘ఇల్లు -నిర్మాణ సందేహాలు–స మాధానాలు’పై అవగాహ న స ద స్సు నిర్వహించారు. చీఫ్‌ సిటీ ప్లానర్‌దేవేందర్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిప్యూటీ మేయర్ బాబా ఫ సియుద్దీన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టౌన్ అండ్ కంట్రీ ప్లానిం గ్ డైరెక్టర్ విద్యా ధర్‌ , అడ్మినిస్ట్రే టివ్‌ స్టా ఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా(అస్కీ) అధికారి సుబ్రహ్మణ్యం, జోనల్ కమిషనర్లు హరి చందన , ముషార ఫ్ అలీ, టౌన్‌‌‌‌‌‌‌‌ ప్లానిం గ్ డైరెక్టర్ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సంద ర్భంగా క మిష నర్ మాట్లా డుతూ చాలామంది ఇంటి నిర్మాణ అనుమతులు, కొనుగోలుకు దళారుల మీద ఆధార పడుతున్నారని చెప్పారు. క ష్టపడి సంపాదించి నిర్మించుకుంటున్న ఇంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.రెరా చట్టం ప్రకారం బిల్డర్స్ నిర్మాణ వివరాలను ప్లాట్స్ కొనుగోలుదారులకు బ్రోచర్లతో తెలియ చేయాల ని సూచించారు. బల్దియా భవన నిర్మాణ అనుమ తులన్నింటిని నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం ఇస్తుం ద ని పేర్కొన్నారు. అనుమతి ఇచ్చిన ప్రతి ఇంటిని నిర్మాణం సమయంలో మూడుసార్లు పరిశీలించి , అంతా సక్రమంగా ఉంటేనే ధ్రువీకరణ పత్రాలు అందిస్తామని వివరించారు. భవనం నిర్మించాక ఎన్‍ఓసీ (నిరభ్యంతరపత్రం) పొందాలని తెలిపారు. లేకపోతే ఆ భవనాలకు విద్యుత్‌ , వాట ర్ బిల్లులు మూడంతలు వసూలు చేసే పరిస్థితి ఉంటుందని కమిషనర్‍ హెచ్చరించారు. ప్లాట్లు అమ్ముతున్న ప్రతి ఏజెంట్‌‌‌‌‌‌‌‌ రేరా లో రిజిస్ట్రే షన్ కలిగి ఉండాలన్నారు. బ్రోచర్‌ లో ఉన్న ప్రతి సదుపాయాన్ని కలిపించాలన్నారు. లేకపోతే రేరా నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని దానకిశోర్ వివరించారు.

అవగాహన లేకనే అనర్థాలు….

అవగాహన లోపంతోనే నిర్మాణదారులకు అనుమతులు పూర్తి స్థాయిలో లభించడం లేదని దానకిశోర్‌ అన్నారు. దీం తోనే నెల కోసారి ప్రతి జోనల్ కార్యాలయంలో ఇలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. భవన నిర్మాణం కోసం కావాల్సి న అన్ని డాక్యు మెంట్‌ ‌‌‌‌‌‌‌లతో GHMC డీపీఎంఎస్‌ విధానంలో దరఖాస్తు  చేశాక, 7 రోజుల్లో పత్రాల్లోని లోటుపాట్ల వివరాలు నిర్మాణదారుడికి ఎస్‌ ఎంఎస్‌ రూపంలో తెలియచేస్తామని చెప్పారు. 21రోజుల్లో  నిర్మాణ అనుమతిని ఇస్తామని తెలిపారు. అప్లి కేషన్ స్టేటస్ తెలుసుకునేందు కు జోన ల్ కార్యాలయంలో డ్యాష్ బోర్డు ఏర్పాటు చేస్తామ ని కమిషనర్ తెలిపారు. సరైన గాలి, వెలుతురు వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటే కుటుంబ సభ్యులకు ఆరోగ్య పరంగా మంచిదని డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీ న్ అన్నారు. నగరంలో సామాన్యుడు కూడా సొంతిల్లు నిర్మించుకునేలా అనుమతులు ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయమన్నారు. నిర్మాణ వ్యవహారంలో ఎలాంటి సందేహాలుఉన్నా నివృత్తి చేసుకునేందుకు ప్రత్యేక యాప్‌ ను రూపొందించామన్నారు. ప్రతి జోన ల్ కార్యాలయంలో ఏర్పాటు చేయబోయే అవగాహన సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం టౌన్‌ ‌‌‌‌‌‌ప్లానింగ్ అధికారులు పవర్ ప్రజెంటేషన్ తో నగర వాసుల అనుమానాల ను నివృత్తి చేశారు.

యాప్ ఇక ఈజీగా…

GHMC లో భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తుచేశారా? చేస్తే ఆ దరఖాస్తు ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఏ అధికారి వద్ద ఉంది? వంటి విషయాలను తెలుసుకునేందు కు GHMC ప్రత్యే క మొబైల్ యాప్‌ ను ఆవిష్కరించింది.ఈ ప్రత్యే క మొబైల్ యాప్‌ ను GHMC కమిషనర్ దానకిశోర్‌, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌‌‌‌‌‌‌‌ విడుదల చేశారు. ఈ మొబైల్ యాప్‌ లో భవన నిర్మాణ అనుమతికి అందచేసిన దరఖాస్తు ఫైల్ నెంబర్‌ను ఎంటర్‍ చేస్తే ఏ అధికారి వద్ద ఆ ఫైల్ ఉంది అనే స్టేట స్‌ ను తెలుసుకునే అవ కాశం ఉంది. GHMC టౌన్‌‌‌‌‌‌‌‌ప్లానింగ్ విభాగంలో 500 చదరపు అడుగుల స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి దాదాపు 500ల కు పైగా డిజైన్లను అందుబాటులో పెట్టిందని స్పష్టం చేశారు.ఆర్కిటెక్ట్‌‌‌‌‌‌‌ల ను నియ మించిడి జైన్‌‌‌‌‌‌‌లను రూపొందించినట్టు వివరించారు. 500 మంది నగర వాసులు హాజరు కావడం తెలుసుకోవాలన్న ఆసక్తికి నిదర్శనమని చెప్పారు. సదస్సులో60మందికి పైగా నిర్మాణదారులు సందేహాల ను లిఖితపూర్వకంగా కోరారని తెలిపారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ టౌన్‌‌‌ ‌‌‌‌ప్లానర్స్ హైదరాబాద్ విభాగం, టౌన్‌‌‌‌‌‌‌‌ప్లానిం గ్ టెక్నిక ల్ స్టా ఫ్ అసోసియేషన్ ముద్రించిన డైరీలను ఆవిష్కరించారు.