ట్విట్టర్ లాంటి కంపెనీలతో ప్రజాస్వామ్యానికి ముప్పే

ట్విట్టర్ లాంటి కంపెనీలతో ప్రజాస్వామ్యానికి ముప్పే

బెంగళూరు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌ అకౌంట్‌‌ను ట్విట్టర్ తొలగించింది. రీసెంట్‌గా ట్రంప్ చేసిన ట్వీట్స్‌‌ను రివ్యూ చేశాకే ఈ నిర్ణయం తీసుకున్నామని ట్విట్టర్ సేఫ్టీ ఓ పోస్ట్‌‌లో తెలిపింది. శాంతికి విఘాతం కలిగే ప్రమాదం ఉందని అందుకే ఆయన అకౌంట్‌‌ను శాశ్వతంగా డిలీట్ చేస్తున్నామని స్పష్టం చేసింది. దీనిపై భిన్న రకాల కామెంట్లు వస్తున్నాయి. ట్రంప్ అకౌంట్ తొలగింపుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మండిపడ్డారు. ‘క్రమబద్ధీకరించని పెద్ద టెక్నాలజీ కంపెనీల వల్ల మన ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉంది. పోటస్ (యూఎస్ ప్రెసిడెంట్)కే ఇలా జరిగినప్పుడు మిగతావారి విషయంలో జరగదని చెప్పలేం. త్వరలోనే భారత్ ఈ రెగ్యులేషన్స్‌‌ను రివ్యూ చేస్తుంది. ఇదే మన ప్రజాస్వామ్యానికి మంచిది’ అని సూర్య ట్వీట్ చేశారు.