మేం ఇలాగే అణచివేసి ఉంటే తెలంగాణ వచ్చేదా..?

మేం ఇలాగే అణచివేసి ఉంటే తెలంగాణ వచ్చేదా..?
  • ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది
  • పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి

హైదరాబాద్: ముందస్తు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి అన్నారు. రాష్ట్రప్రభుత్వం రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన రైతు రచ్చబండ కార్యక్రమం జరగకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేస్తుండడంపై పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి ఆగ్రహం వ్యక్తం చేశారు. 
ముందస్తు అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని మల్లురవి స్పష్టం చేశారు. రైతులు వరి పంట వేయొద్దని చెబుతున్న సీఎం కేసీఆర్ స్వయంగా తన పొలంలో వరి పండిస్తున్న విషయాన్ని ప్రజలకు తెలియజేస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే అణిచివేస్తే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు మల్లురవి. 
 

 

ఇవి కూడా చదవండి:

కిలోల కొద్దీ బంగారం.. నోట్ల గుట్టలు సీజ్

తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారే

ముందంజలో ఆమ్ ఆద్మీ పార్టీ