Good Health : తినే తిండితో బలం రావటం లేదా.. అయితే మీ ఫుడ్ ఇలా మార్చండి..!

Good Health : తినే తిండితో బలం రావటం లేదా.. అయితే మీ ఫుడ్ ఇలా మార్చండి..!

శ్రవణ్ హైదరాబాద్ లోని ఒక సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు మంచి జీతం. కానీ పని ఒత్తిడి ఎక్కువ. చాలా టైమ్ ఆఫీసులోనే గడపాలి. ఎక్కువగా పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ ఫుడ్ తింటుంటాడు. రెగ్యులర్ గా జిమ్ కు వెళ్తుంటాడు. అయితే, ఈ మధ్య తరచూ జబ్బు పడుతున్నాడు. ఆసుపత్రిలో పరీక్షలు చేయిస్తే విటమిన్ లోపం కూడా దీనికి ఒక కారణమని తేలింది.

శ్రవణిలాగే చాలా మంది ఖరీదైన ఫుడ్ తీసుకుంటున్నారు. కానీ, వాటి వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు పూర్తి స్థాయిలో అందడం లేదు. నగరాలు, పట్టణాల్లోని శ్రవణాలాగే చాలా మంది విటమిన్ లోపంతో బాధపడుతున్నారని ఈ మధ్య తేలింది. దీనివల్ల అప్పటికప్పుడు ప్రమాదం లేకపోయినా, కొంత కాలం తర్వాత ప్రాణాంతక జబ్బులూ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉన్నాం. రోజుూ వ్యాయామం కూడా చేస్తున్నాం. ఇక ఏ జబ్బూ రాకపోవచ్చు. అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఎంత ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులో అయినా విటమిన్ల లోపం ఉండే అవకాశం ఉంది.

దీని ప్రభావంతో దీర్ఘకాలిక జబ్బులు చుట్టుముడతాయి అని హెచ్చరిస్తున్నారు పోషకాహార నిపుణులు. నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్న ప్రజల్లో చాలా మంది ఆరోగ్యంగా ఉన్నా, విటమిన్ లోపంతో ఉన్నారని హైదరాబాద్ కు చెందిన 'నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) సర్వేలో వెల్లడైంది. ఈ సంస్థ ముప్పై నుంచి డెబ్బై ఏళ్ల వయసు కలిగిన కొంత మంది స్త్రీ పురుషులపై సర్వే చేసింది. వీళ్లలో సగానికిపైగా వివిధ విటమిన్ లోపం కలిగి ఉన్నారని తేలింది.

కీలక పోషకాలు

ప్రతి మనిషికి రోజూ అన్నిరకాల పోషకాలు అవసరం. పోషకాల్లో అత్యంత ముఖ్యమైనవి. విటమిన్స్, వీటిని సూక్ష్మ పోషకాలు అంటారు. ఎందుకంటే ఇవి చాలా తక్కువ పరిమాణంలోనే అవసరం. కానీ, వీటి వల్ల ఉపయోగాలు మాత్రం అధికం. మనకు కావాల్సిన శక్తిని అందిస్తూ, పలు రకాల వ్యాధులు రాకుండా కాపాడతాయి. జీవక్రియల నిర్వహణకు, కణజాలాల ఎదుగుదలకు ఇవి ఎంతో ముఖ్యమైనవి. విటమిన్స్ లోపిస్తే చాలా రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కొన్నిరకాల విటమిన్లు శరీరంలోనే ఉత్పత్తి అయితే, మరికొన్నింటిని ఆహారం ద్వారా తీసుకోవాలి. పేగుల్లో ఉండే కొన్ని రకాల బ్యాక్టీరియా కూడా విటమిన్లు ఉత్పత్తి చేయడంలో తోడ్పడతాయి. సరైన స్థాయిలో విటమిన్లు ఉండే ఆహారం. తీసుకోకపోతే విటమిన్ లోపం తలెత్తుతుంది.

సర్వేలో కీలకాంశాలు

* దాదాపు డెబ్భై శాతం మందిలో విటమిన్ బి-2, 46 శాతం మందిలో విటమిన్ లోపం ఉంది.
* 46 శాతం మందిలో విటమిన్ బి12-32. శాతం మందిలో బి-9 (ఫోలేట్) లోపం ఉంది.
* 19 శాతం మంది విటమిన్-డి 11 శాతం మంది బి1, 6 శాతం మంది విటమిన్-ఎ లోపం కలిగి ఉన్నారు. 
* ఇతర విటమిన్లు కూడా తక్కువ స్థాయిలోనే ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

జబ్బులకు దారి

విటమిన్ లోపం చాలా చిన్న విషయంగా కనిపించవచ్చు. కానీ, ఇది దీర్ఘకాలం కొనసాగితే పలు రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత అధ్యయనం ప్రకారం... భారతీయుల లైఫ్ స్టైల్ లోచాలా మార్పులు వచ్చాయి. ఎండ తగలకుండా ఉండే జీవన విధానానికి అలవాటు పడిపోయారు. దీని వల్ల విటమిన్ -డి లోపం కనిపిస్తోంది. ఇది మధుమేహం వచ్చేందుకు కూడా దారి తీస్తోంది. 

• బి2 రైబోఫ్లేవిన్) లోపంతో నాడీ సంబంధిత జబ్బులు. ఎనీమియా, గుండె జబ్బులు వస్తాయి.
• బి6 లోపంతో మెదడు సంబంధిత సమస్యలు, ఫిట్స్, క్యాన్సర్, మైగ్రేన్, క్రానిక్ పెయిన్, డిప్రెషన్ సమస్యలొస్తాయి.
• బి2, బి6, బి12 లోపంతో రక్ష సంబంధిత జబ్బులు వస్తాయి. బ్రెయిన్, హార్ట్ స్టోక్లు కూడా వచ్చే అవకాశం ఉంది. 

కారణాలు

నగరాలు, పట్టణ ప్రజల్లోని విటమిన్ లోపానికి అనేక కారణాలున్నాయి. తృణధాన్యాలు, చిరు ధాన్యాలు ఎక్కువగా తింటున్నా, పండ్లు, తక్కువగా తీసుకుంటున్నారు. పైగా ఇటీవలి కాలంలో ఫాస్ట్ ఫుడ్, జండ్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. వీటి నుంచి అన్ని రకాల విటమిన్లు లభించవు.

ఒకే రకమైన ఆహార పదార్థాల్ని ఎక్కువగా తీసుకోవడం కూడా విటమిన్ లోపానికి ఒక కారణం. ఆహారం కోసం ఎక్కువ డబ్బు ఖర్చుపెడుతున్నా, అన్ని పోషకాలు అందే ఆహారం పై దృష్టి పెట్టడం లేదు. విటమిన్లు ఉండే ఆహారం తీసుకున్నా కూడా కొన్నిసార్లు అవి శరీరానికి అందడం లేదు. దీనికి వయసు, జన్యు పరమైన అంశాలు, పర్యావరణం, పోషక సంబంధిత వ్యాధులు కూడా కారణం.

ఏం చేయాలి?

ఆహారంలో వైవిధ్యం ఉండేలా చూసుకోవాలని పరిశోధనకు నేతృత్వం వహించిన నిపుణులు సూచిస్తున్నారు. అన్ని రకాల పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, నట్స్ వంటివి తీసుకోవాలి. సీజనల్ ఫ్రూట్స్ తప్పనిసరి. ఎప్పుడూ ఒకే రకమైన ఆహారం కాకుండా అన్ని రకాల ఆహార పదార్థాల్ని తినేందుకు ప్రయత్నించాలి. క్రమం తప్పకుండా విటమిన్ పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహాలు తీసుకోవాలి. కొన్ని రకాల విటమిన్ సప్లిమెంట్లు దొరుకుతున్నాయి. వీటిని డాక్టర్ల సూచన మేరకు వాడాలి. కృత్రిమ విధానంలో విటమిన్లు తీసుకోవడం. కన్నా, నేరుగా ఆహారం ద్వారా తీసుకుంటేనే మంచిదని వైద్యుల సూచన.