గుజరాత్ లో ఓటేయకపోతే ఫైన్

గుజరాత్ లో ఓటేయకపోతే ఫైన్

రాజ్ కోట్: రాజకీయాల వల్ల కుటుంబాల మధ్య చిచ్చురేగిన సందర్భాలు కోకొల్లలు.. ఇలాంటి పరిస్థితి తమకు రాకూడదనే గుజరాత్ లోని రాజ్ సమధియాల గ్రామస్థులు ఎన్నికల ప్రచారాన్ని బ్యాన్ చే శారు.అలాగని ఓటేయరని కాదు. ఓటువేయడం తప్పనిసరి చే శారు. ఓటేయకపోతే ఫైన్ వసూలు చేస్తా రు. గ్రామ అభివృద్ధి కమిటీ (విలేజ్ డెవలప్ మెంట్ కమిటీ) నిబంధనలకు గ్రామస్థులు కట్టుబడి ఉంటారు.నిబంధనలు ఉల్లంఘిస్తే ఫైన్ కట్టాల్సిందే. “గ్రామంలోని మంచి వాతావరణాన్ని ఎవరూ చెడగొట్టకూడదన్న ఉద్దేశంతో ఎన్నికల ప్రచారాన్ని నిషేధించాం .రాజకీయ పార్టీలకు ఇది అర్థమైంది.వాళ్లు మాకు సపోర్ట్ చేస్తున్నారు.ఓటేయనివారికి రూ.51 ఫైన్ వేస్తాం . ప్రతిసారి వంద శాతం పోలింగ్ కోసం ప్రయత్నిస్తున్నాం.ఓటరు జాబితాలో చనిపోయినవాళ్లు, పెళ్లై అత్తారింటికి వెళ్లిన అమ్మాయిల పేర్లు ఉంటున్నాయి . అయినా 95, 96 శాతం పోలింగ్ అవుతుంది” అని సర్పంచ్ అశోక్భాయ్ వఘేరా అన్నారు. గ్రామంలోవైఫై, సీసీ టీవీ కె మెరాలు, ఆర్వో ప్లాంట్ తోపాటు అన్ని ఆధునిక సదుపాయాలు ఉన్నాయని,ఎవరైనా ప్లాస్టిక్ బ్యాగ్ లను ఎక్కడపడితే అక్కడ పడేసినా ఫైన్ వసూలు చేస్తున్నామన్నారు.