పంటంతా కొనకపోతే తెచ్చి ఫాం హౌస్ దగ్గర పోస్తాం

V6 Velugu Posted on Sep 14, 2021

  • కేంద్ర ప్రభుత్వం 64 వేల కోట్లు చెల్లించి వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేస్తే కేంద్రం పేరు చెప్పవెందుకు..?
  • మిషన్ భగీరథ ఫీల్డ్ స్టాఫ్ ఉన్నారా.. ఉద్యోగంలోంచి తీసేశారా..?
  • విద్యావాలంటీర్లను తీసేశారు.. ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు
  • ప్రైవేటు టీచర్లకు పక్కా ఇళ్లు కట్టిస్తానని ఇంతవరకు ఒక్కటి కూడా ఇవ్వలేదే..?
  • ఆర్టీసీలో 80శాతం ప్రైవేటు బస్సులే.. ఉద్యోగ కార్మికుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది
  • బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావ్ 

మెదక్: రైతులు పండించిన పంటనంతా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే.. పంటంతా తెచ్చి ఫౌమ్ హౌస్ ముందు పోస్తామని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు హెచ్చరించారు.  కేంద్ర ప్రభుత్వం 64 వేల కోట్లు చెల్లించి వెబ్ సైట్ ద్వారా పంట కొనుగోలు చేస్తే.. కేంద్రం పేరు చెప్పడంలేదెందుకు ? అని ఆయన ప్రశ్నించారు. మిషన్ భగీరథ ఫీల్డ్ స్టాఫ్ ఉద్యోగాల్లో ఉన్నారో.. తీసేశారో చెప్పడం లేదని.. అదేవిధంగా విద్యావాలంటీర్లను, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగాల్లోంచి తీసేశారని ఆయన ఆరోపించారు. ప్రైవేటు టీచర్లకు పక్కా ఇళ్లు కట్టిస్తానని ఇంతవరకు ఒక్కటి కూడా ఇవ్వలేదే..? ఆర్టీసీలో 80శాతం ప్రైవేటు బస్సులే.. ఉద్యోగ కార్మికుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది అని ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. 
మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాత్ర లో ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ బిజెపి వాల్లు ఏమి చేసిండ్రు అని మెదక్ టీఆర్ఎస్ వారు అంటున్నారని ప్రస్తావిస్తూ..  బాలానగర్ నుండి మెదక్ వరకు జాతీయ రహదారి నిర్మాణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్మించిందని అన్నారు.  ఎల్కతుర్తి నుండి మెదక్ వరకు 650 కోట్లు జాతీయ రహదారి నిర్మాణం కొరకు మంజూరు చేసింది నరేంద్రమోడీ గారి ప్రభుత్వమేనన్నారు. 2005 లో లల్లు ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు మనోహరాబాడ్ నుండి పెద్దపల్లి వరకు రైలు మంజూరు చేస్తాను అంటే అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.  కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గజ్వేల్ కి ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు వచ్చినప్పుడు. నిధులు మంజూరు చేస్తే ఇప్పుడు మనోహరాబాద్ నుంచి పెద్దపల్లి వరకు రైలు పనులు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. 
అందర్నీ ఉద్యోగాల్లోంచి పీకేస్తున్నారు
తెలంగాణ రాష్ట్రంలో 13వేల మంది విద్యా వాలంటీర్లను తొలగించారు, 5700 మంది భగీరథ లో పనిచేసిన ఫీల్డ్ స్టాప్ ను ఉద్యోగంలో ఉంచినారా.  తొలగించినారా చెప్పాలని ఆయన నిలదీశారు. ఆర్టీసీలో 80శాతం బస్సులు ప్రైవేటు బస్సులే ఉన్నాయని, ఆర్టీసీ ఉద్యోగ కార్మికుల పరిస్థితి ఇప్పుడు అధ్వానంగా మారిందన్నారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లు 7651 మంది తొలగించారని, ఒకవైపు 1 లక్ష 32 వేల ఉద్యోగాలు ఇచ్చినాము అంటున్నారు.. అంతకంటే ఎక్కువ మందిని ఉద్యోగాల నుంచి తొలగించారని ఆయన ఆరోపించారు.  ప్రైవేటు టీచర్లకు పక్కా ఇల్లు కట్టించి ఇస్తానన్నావ్.. ఇంతవరకు ఒక్కరికి కూడా కట్టివ్వలేదని ఆయన ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ నీ తెరిపిస్తా అన్నావు. ఏడు సంవత్సరాలు అయినా ఇంత వరకు దాని గురించి పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. మెదక్ లోని ఇందిరాగాంధీ స్టేడియంకు ఖేలో  ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే ఆ నిధులు మేమే ఇచ్చామని స్థానిక  నాయకులు  చెపుతున్నారని, పండించిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేనే  కొంటాను అని చెప్పావని ఆయన గుర్తు చేశారు. 
 

Tagged BJP Today, BJP MLA Raghunandan Rao, ts bjp, telangana bjp, MLA Raghunandan Rao, , medak today, Bandi Sanjay Padayatra, raghunandan rao comments

Latest Videos

Subscribe Now

More News