ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. నచ్చకపోతే రెండేళ్లలో దిగిపోతా

ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. నచ్చకపోతే రెండేళ్లలో దిగిపోతా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేఅదే విధంగా సీఎం వైఎస్శ్ రాష్ట్రంలో నిర్వహిస్తున్న వారాహి యాత్ర సంచలనం సృష్టిస్తోంది.మొదటిరోజు కత్తిపూడిలో నిర్వహించిన బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేసిన పవన్ ..రెండో రోజు ( జూన్15)  వారాహి యాత్రలో భాగంగా కాకినాడ జిల్లా చేబ్రోలులో పట్టు రైతులు, చేనేత కళాకారులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పదవిపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రిగా తనకి ఒక అవకాశం ఇవ్వాలని కోరారు.రెండు సంవత్సరాలలో తన పనితీరు నచ్చకపోతే రీకాల్ చేయండి ముఖ్యమంత్రి పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటా అని వ్యాఖ్యానించారు. 2024, 2029లో జనసేన పార్టీని నమ్మండని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని బంగారు ఆంధ్రప్రదేశ్ గా మార్చి చూపిస్తానని పవన్ తెలియజేశారు. మంచి పాలన అందిస్తానని.ఒకవేళ పాలన నచ్చకపోతే రెండేళ్లలో నేనే పదవి నుండి స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటానని చేబ్రోలులో రైతులు చేనేత కళాకారుల ఆత్మీయ సమ్మేళనంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన వారాహి యాత్ర ఏపీ రాజకీయాల్లో ప్రకంపనాలు సృష్టిస్తోంది.ఇదే సమయంలో పవన్ ఇస్తున్న హామీలు కూడా రాజకీయంగా సంచలనంగా మారుతున్నాయి.