
మధ్యాహ్నం తిన్న వెంటనే నిద్ర వస్తుంది కొందరికి. ఇంట్లో అయితే ఓకే. కానీ, ఆఫీస్ లేదా ఏదైనా పని మీద బయటకు వెళ్లినప్పుడు అలా కుదరదు. అలా జరగడానికి కారణం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండే ఫుడ్ తినడమే అంటోంది న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ. అంతేకాదు లంచ్ తర్వాత నిద్ర రాకుండా ఉండడానికి కొన్ని టిప్స్ చెప్పింది కూడా.
లంచ్ టైంలో కార్బోహైడ్రేట్స్ నిండుగా ఉన్న అన్నం, దోసె, ఆలుగడ్డ వంటివి తింటే నిద్ర ముంచుకొస్తుంది. అందుకని వాటి బదులు ప్రొటీన్లు ఉండే గుడ్లు, పండ్లు, నట్స్ వంటివి తినాలి. దాంతో మధ్యాహ్నం పూట ఎక్కువ తిన్నా కూడా నిద్ర రాదు. యాక్టివ్గా ఉంటారు. లంచ్ బాక్స్ మిస్ అయితే... బిర్యానీ, ఫాస్ట్ఫుడ్ తినడానికి ప్రిఫర్ చేస్తారు. అవి తిన్న కొద్ది సేపటికే మత్తుగా అనిపిస్తుంది. కాబట్టి అలాంటప్పుడు గ్రిల్డ్ చికెన్, ఉడికించిన కూరగాయలు, సలాడ్స్ వంటివి తినడం బెటర్.