నెలకు రూ.9 వేలతో రూ.కోటి సంపాదన

నెలకు రూ.9 వేలతో రూ.కోటి సంపాదన

బిజినెస్ డెస్క్ వెలుగు: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఆకర్షణీయమైన వడ్డీని ఇచ్చే పథకమే కాదు.. ఇందులో ఇన్వెస్ట్మెంట్లు సేఫ్, ఇది ట్యాక్స్ సేవింగ్ కమ్ ఇన్వెస్ట్మెంట్ టూల్. ఇది కేంద్ర ప్రభుత్వ స్కీమ్ కాబట్టి పూర్తిగా రిస్క్ ఫ్రీ. దీర్ఘకాలిక ఫైనాన్షియల్ గోల్స్ కోసం పీపీఎఫ్ ఎంతో బెటర్. నెలకు రూ తొమ్మిది వేల చొప్పున దీర్ఘకాలానికి పీపీఎఫ్ ఖాతాలో ఇన్వెస్ట్ చేస్తే ఆ మొత్తం రూ.1.11 కోట్లు అయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం పీపీఎఫ్ ఇన్వె మెంట్ పై 7.1 శాతం వడ్డీ ఇస్తున్నారు. బ్యాంక్ ఎస్టీలతో పోల్చుకుంటే, ప్రస్తుతం ఇదే ఎక్కువ వడ్డీ. ధరల పెరుగుదలను లెక్కలోకి తీసుకున్నా, మంచి రిటర్నులనే ఇస్తుంది. సాధారణంగా పీపీఎఫ్ ఖాతా 15 ఏళ్లకు మెచ్యూర్ అవుతుంది. కావాలనుకుంటే మరో బదేళ్లపాటు గరువు పెంచుకోవచ్చు. తమ రిటైర్మెంట్ డబ్బును సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి పీపీఎఫ్ అనువుగా ఉంటుంది. ప్రతి ఏటా వడ్డీపై వడ్డీ జమ అవుతుంది. కాబట్టి రిటర్నులు ఎక్కువగా ఉంటాయి. రిటైర్మెంట్ ఫండ్ కోసం బ్యాంకులో లేదా పోస్టాఫీసులో (ఎక్కడ ఖాతా ఉంటే అక్కడ ప్రత్యేకంగా అప్లికేషన్ అందిస్తే పీపీఎఫ్ ఖాతా గడువును ఐదేళ్లు పెంచుతారు. ప్రస్తుత ఖాతా మెచ్యూర్ అయ్యాకే.. ఈ దరఖాస్తు ఇవ్వాలని ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ జితేంద్ర సోలంకీ చెప్పారు. ఉదాహరణకు ఒక ఉద్యోగికి 30 ఏళ్లు ఉన్నప్పుడు. పీపీఎఫ్ ఖాతా తెరిస్తే మరో 30 ఏళ్ల పాటు డబ్బు దాచుకోవచ్చు.

రూ. కోటి టార్గెట్ ఎలా చేరుకోవచ్చంటే..

ఒక వ్యక్తి పీపీఎఫ్ ఖాతాలో రూ.9,000 పె పెట్టుబడి పెడితే, 15 సంవత్సరాల తరువాత, పీపీఎఫ్ఎఎఫ్ బ్యాలెన్స్ రూ.29,29,111 అవుతుంది. తదనంతరం కూడా ఖాతాదారు దు ఖాతాను పొడిగించుకోవచ్చు. మరో 15 సంవత్సరాలపాటు ఇన్వెస్ట్మెంట్ ను కొనసా గించగలిగితే, వడ్డీపై వడ్డీ పొందడం ద్వారా పెట్టుబడి విలువను రూ. 1.11 కోట్లు పెంచు కోగలుగుతాడు. ఎటువంటి రిస్క్ లేకుండా సులువుగా కోటీశ్వరులయ్యే మార్గం ఇదేనని వెల్త్ మేనేజ్ మెంట్ సంస్థ ట్రాన్సెంట్ కన్సల్టం. చెందిన కార్తీక్ ఝవేరీ అన్నారు. రిస్క్ వద్దనుకునే వాళ్లకు పీపీఎఫ్ చాలా మంచి ఆప్షన్ అని స్పష్టం చేశారు.