
ఆక్సిడైజ్డ్ జువెలరీ ఎక్కువ రోజులు వాడితే రంగు తేలి పోతుంది. దాంతో ఇష్టంగా కొనుకున్న మ్యాచింగ్ జువెలరీని కాస్త రంగు మారగానే పక్కన పెడతారు చాలామంది. కానీ అలా పక్కన పడేయకుండా కొన్ని సులువైన పద్ధతులలో ఆక్సిడైజ్డ్ జువెలరీని శుభ్రం చేసుకుని మళ్లీ వాడుకోవచ్చు. అదెలాగంటే. ఇంట్లో గిన్నెలు శుభ్రం చేసుకోవడానికి వాడే డిటర్జెంట్, లిక్విడ్‌తో ఆక్సిడైజ్డ్ జువెలరీని మళ్లీ మెరిపించొచ్చు. ఒక గిన్నెలో గోరు వెచ్చని నీళ్లు పోసి డిటర్జెంట్ లేదా లిక్విడ్ వేసి కలపాలి. ఆ మిశ్రమంలో కొద్దిసేపు ఆక్సిడైజ్డ్ జువెలరీ ఉంచితే మురికి తేలికగా పోతుంది. తర్వాత వేడి నీళ్లలో నుంచి జువెలరీని బయటకు తీసి టూత్ బ్రష్‌తో అంచులను శుభ్రం చేయాలి. కొంచెం సేపు మంచి నీళ్లలో ఉంచి పొడి క్లాత్‌తో తుడిస్తే జువెలరీ మెరుస్తుంది. టూత్ పేస్ట్‌తో కూడా ఆక్సిడైజ్డ్ జువెలరీని శుభ్రం చేసుకోవచ్చు. కొంచెం టూత్ పేస్ట్ తీసుకొని బ్రష్‌తో జువెలరీ మూలలను రుద్దితే దుమ్ము వదులు తుంది. ఆ తర్వాత గోరు వెచ్చటి నీళ్లలో పది నిమిషాలు ఉంచి పొడి క్లాత్‌తో తుడిస్తే జువెలరీ కొత్తదానిలా మెరిసిపోతుంది.