మెట్రోలో ట్రావెల్‌ చేయాలంటే..స్మార్ట్ కార్డు,మాస్క్‌ కంపల్సరీ

మెట్రోలో ట్రావెల్‌ చేయాలంటే..స్మార్ట్ కార్డు,మాస్క్‌ కంపల్సరీ
  •    నో టోకెన్స్​, కొన్ని స్టేషన్లలోనే హాల్ట్‌‌ 
  •     మెట్రో రీస్టార్ట్‌‌పై ఢిల్లీ కొత్త గైడ్‌‌లైన్స్

న్యూఢిల్లీ, వెలుగు: కరోనా విజృంభణతో దాదాపు 5 నెలలుగా నిలిచిపోయిన మెట్రో రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. కేంద్రం తాజాగా విడుదల చేసిన అన్‌‌లాక్ 4.0 లో సెప్టెంబర్ 7 నుంచి మెట్రో సర్వీసులకు పర్మిషన్ ఇచ్చింది. దీంతో మెట్రోలో సేఫ్‌‌  ట్రావెలింగ్‌‌కు ఢిల్లీ సర్కార్ రెడీ అయ్యింది. ఈ మేరకు స్టేట్ గవర్నమెంట్ కొత్త గైడ్‌‌లైన్స్‌‌ను ఆదివారం రిలీజ్‌‌ చేసింది. వైరస్ వ్యాప్తిని కంట్రోల్‌‌ చేసేందుకు ‘నో టోకెన్’ సిస్టమ్‌‌ను అమలు చేయనుంది. ఈ ప్లేస్‌‌లో స్మార్ట్ కార్డులకు మాత్రమే అనుమతి ఇవ్వనుంది. మాస్క్‌‌లు, థర్మల్ స్ర్కీనింగ్, సోషల్‌‌ డిస్టెన్సింగ్‌‌ను తప్పనిసరి చేస్తూ డెసిషన్‌‌ తీసుకుంది. పాసింజర్స్‌‌ రద్దీని తగ్గించేందుకు స్టాప్‌‌లను తగ్గించాలని డెసిషన్‌ తీసుకున్నారు. కంటైన్మెంట్ ఏరియాల్లో ఉన్న మెట్రో స్టేషన్లు క్లోజ్‌‌ చేసే ఉంటాయి. ట్రైన్‌‌లోకి ఫ్రెష్‌‌ ఎయిర్‌‌‌‌ వచ్చేలా ఏసీ సిస్టంను రీ డిజైన్‌‌ చేస్తారు. పాసింజర్లు చేతులు శుభ్రం చేసుకునేలా హ్యాండ్ శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. అన్ని సేఫ్టీ ప్రికాషన్స్‌‌తో ఢిల్లీ మెట్రో సర్వీసులను రీస్టార్ట్‌‌ చేస్తామని స్టేట్ ట్రాన్స్‌‌పోర్ట్ మినిస్టర్ కైలాశ్‌‌ గహ్లోత్ తెలిపారు. టోకెన్ సిస్టంను టెంపరరీగా నిలిపివేస్తున్నామన్నారు. కరోనా వ్యాప్తి ఉన్నప్పటికీ.. పాసింజర్స్‌‌కు సేఫ్‌‌ జర్నీ అందించేందుకు రెడీగా ఉన్నామని, డిజిటల్ పేమెంట్స్‌‌కు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.