జుట్టుకు వేసుకున్న రంగు ఎక్కువ రోజులు ఉండాలంటే...

జుట్టుకు వేసుకున్న రంగు ఎక్కువ రోజులు ఉండాలంటే...

తెల్ల వెంట్రుకలు కనిపించకుండా వేసుకున్న ఆ రంగు ఎక్కువ రోజులు ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు హెయిర్ కేర్ ఎక్స్​పర్ట్స్​.   

  • రంగు వేసుకున్న మూడు రోజుల వరకు షాంపూ పెట్టకూడదు. అప్పుడే రంగు వెంట్రుకలకి బాగా అతుక్కుని ఎక్కువ రోజులు ఉంటుంది.
  • తలస్నానం చేసేటప్పుడు మామూలు షాంపూ బదులు కలర్​ ప్రొటెక్ట్ చేసే షాంపూ వాడాలి. ఈ షాంపూలు జుట్టు పీహెచ్​ని కాపాడతాయి. దాంతో జుట్టు దెబ్బతినదు.షాంపూతో తలస్నానం చేశాక జుట్టుకి కండీషనర్ వాడాలి.
  • కండీషనర్ వాడనప్పుడు హెయిర్​ మాస్క్​ వాడినా,  నూనె రాసుకున్నా ఓకే. బ్లోయర్ వాడొద్దు.
  • ప్రతిరోజు జుట్టుని శుభ్రం చేసుకోవద్దు. అలాచేస్తే వెంట్రుకలు రంగుపోయి పొడి బారినట్టు  కనిపిస్తాయి. మాడు జిడ్డుగా ఉంటే సాధారణ షాంపూ కాకుండా డ్రై షాంపూ వాడాలి.